వరద ముంపులో పారిస్ | Rivers in France, Germany burst their banks; floods kill 6 | Sakshi
Sakshi News home page

వరద ముంపులో పారిస్

Jun 3 2016 2:42 AM | Updated on Sep 4 2017 1:30 AM

వరద ముంపులో పారిస్

వరద ముంపులో పారిస్

జర్మనీ, ఫ్రాన్స్‌ల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆరుగురు మరణించారు. లోయింగ్, సీన్ నదులు సామర్థ్యానికి మించి ప్రవహిస్తున్నాయి.

జర్మనీ, ఫ్రాన్స్ వరదల్లో ఆరుగురు మృతి
బెర్లిన్: జర్మనీ, ఫ్రాన్స్‌ల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆరుగురు మరణించారు. లోయింగ్, సీన్ నదులు సామర్థ్యానికి మించి ప్రవహిస్తున్నాయి. పారిస్, సెంట్రల్ ఫ్రాన్స్‌లో పాతిక వేల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షాలకు రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. పలు వీధులు జలమయమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో  గురువారం పాఠశాలలను మూసివేశారు. ప్రాణాలు రక్షించుకోవడానికి కొందరు ఇళ్ల పైకప్పులు ఎక్కారు. రానున్న రోజుల్లో మరిన్ని వానలు కురిసే అవకాశం ఉంది. కాగా, పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండిలో పెనుగాలుల విధ్వంసానికి 36 మంది మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement