రాయిటర్స్‌ జర‍్నలిస్టులకు జైలు శిక్ష

Reuters reporters sentenced to seven years in a Myanmar prison - Sakshi

రాయిటర్స్‌ జర్నలిస్టులకు  మయన్మార్‌ కోర్టు  ఏడేళ్ల జైలు శిక్ష  విధించింది. రాయిటర్స్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై నమోదైన మయన్మార్‌ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న అభియోగాలను ధృవీకరించిన కోర్టు  ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు  చేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.  ఈ తీర్పు  మయన్మార్‌లో బ్లాక్‌ డే అని రాయిటర్స్‌ ఎడిటర్‌  ఇన్‌ చీఫ్‌ స్టీఫెన్‌ జే అడ్లెర్‌ వ్యాఖ్యానించారు

రాయిటర్స్‌ జర్నలిస్టులు వా లోనె (32) కియా సో ఓ (28) మయన్మార్‌ చట్టాన్ని ఉల్లంఘించారంటూ  అభియోగాలతో  గత ఏడాది అరెస్ట్‌ అయ్యారు .  ఇద్దరు పోలీసుల నుండి అతి ముఖ్యమైన రహస్య పత్రాలను జర్నలిస్టులు సేకరించడం ద్వారా వలసవాద కాలం నాటి చట్టాన్ని ఉల్లంఘించారని  అక్కడి ప్రాసిక్యూషన్‌ అధికారులు వాదించారు. వారు ఉల్లంఘించింది మయన్మార్‌ అధికార రహస్యాల చట్టమని ప్రాసిక్యూటర్లు గట్టిగా వాదించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top