breaking news
Myanmar police
-
రాయిటర్స్ జర్నలిస్టులకు జైలు శిక్ష
రాయిటర్స్ జర్నలిస్టులకు మయన్మార్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రాయిటర్స్కు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై నమోదైన మయన్మార్ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న అభియోగాలను ధృవీకరించిన కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు మయన్మార్లో బ్లాక్ డే అని రాయిటర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టీఫెన్ జే అడ్లెర్ వ్యాఖ్యానించారు రాయిటర్స్ జర్నలిస్టులు వా లోనె (32) కియా సో ఓ (28) మయన్మార్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ అభియోగాలతో గత ఏడాది అరెస్ట్ అయ్యారు . ఇద్దరు పోలీసుల నుండి అతి ముఖ్యమైన రహస్య పత్రాలను జర్నలిస్టులు సేకరించడం ద్వారా వలసవాద కాలం నాటి చట్టాన్ని ఉల్లంఘించారని అక్కడి ప్రాసిక్యూషన్ అధికారులు వాదించారు. వారు ఉల్లంఘించింది మయన్మార్ అధికార రహస్యాల చట్టమని ప్రాసిక్యూటర్లు గట్టిగా వాదించిన సంగతి తెలిసిందే. -
219 అక్రమరవాణా బాధితులకు విముక్తి
యంగాన్(మయన్మార్): పొరుగు దేశాలైన చైనా, థాయిలాండ్, మలేసియాలకు అక్రమరవాణా చేసిన 219 మందిని గతనెలలో మయన్మార్ పోలీసులు రక్షించినట్టు అక్రమ రవాణా నియంత్రణ విభాగం ఆదివారం వెల్లడించింది. రక్షింపబడిన వారిలో 206 మంది నిర్బంధిత కార్మికులు, బలవంతపు పెళ్లి చేసి వ్యభిచారంలోకి నెట్టివేయబడిన 11 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే 8 నెలల కిత్రం 392 మంది అక్రమ రవాణా బాధితులను రక్షించినట్టు ఓ నివేదిక తెలిపింది. అక్రమ రవాణాకు పాల్పడిన 165 మందితోపాటు 78 మంది అనుమానితులను కూడా అరెస్ట్ చేసినట్టు గణాంకాల్లో వెల్లడైంది. 2006 నుంచి గతనెల ఆగస్టు వరకు జాతీయవ్యాప్తంగా మొత్తం 1,205 మంది అక్రమరవాణా కేసులు నమోదు అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అదేవిధంగా 2,394 మంది బాధితులను రక్షించి, 2,196 అక్రమరవాణాదారులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మహిళలు, కార్మికులు, చిన్నారుల అక్రమ రవాణాను అడ్డుకునే దిశగా ప్రస్తుత అక్రమరవాణా నియంత్రణ చట్టంలో మార్పులు చేసి, అందులోని లొసుగులను సవరణలు చేయనున్నట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.