పర్వతం అంచున రెస్టారెంట్ అండ్ బార్ | Restaurant and bar corner of peakpeak waterfall, coper | Sakshi
Sakshi News home page

పర్వతం అంచున రెస్టారెంట్ అండ్ బార్

Mar 14 2016 7:15 AM | Updated on Sep 3 2017 7:44 PM

పర్వతం అంచున రెస్టారెంట్ అండ్ బార్

పర్వతం అంచున రెస్టారెంట్ అండ్ బార్

పర్వతం అంచున రెస్టారెంట్ అండ్ బార్.. రెస్టారెంట్లో కింద అంతా పారదర్శకంగా ఉండే గ్లాస్ ఫ్లోర్.. స్విమ్మింగ్‌పూల్..

మెక్సికో: పర్వతం అంచున రెస్టారెంట్ అండ్ బార్.. రెస్టారెంట్లో కింద అంతా పారదర్శకంగా ఉండే గ్లాస్ ఫ్లోర్.. స్విమ్మింగ్‌పూల్.. బార్‌లో కూర్చుని ఉంటే.. ఎదురుగా కనువిందు చేస్తూ భారీ జలపాతం.. వింటుంటేనే అదిరిపోతుంది కదూ.. ఇక అక్కడికి వెళ్తేనో.. అయితే.. ఇది ఇంకా డిజైన్ దశలోనే ఉంది.
 
 మెక్సికోలోని కాపర్ కాన్యాన్ ప్రాంతంలో నిర్మించేందుకు గానూ టాల్ ఆర్కిటెక్ట్స్ సంస్థ ఈ కాపర్ కాన్యాన్ కాక్‌టైల్ బార్‌ను డిజైన్ చేసింది. రెండస్తుల్లో ఉండే ఈ రెస్టారెంట్ కింది అంతస్తులో బార్ ఉంటుంది. ట్రెక్కింగ్ లాంటి సదుపాయాలు అదనం. అయితే.. ఎత్తై ప్రదేశాలంటే భయపడేవాళ్లు మాత్రం ఈ రెస్టారెంట్ జోలికి పోకపోవడమే బెటరంటున్నారు.

Advertisement
Advertisement