
సియోల్ : తగిన పరిస్థితులు కల్పిస్తేనే ఉతర్త కొరియాతో చర్చలకు సిద్ధమని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జా ఇన్ తెలిపా రు. అమెరికా, దక్షిణ కొరియాలతో చర్చల కు ఉత్తర కొరియా సిద్ధంగా ఉన్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది. అక్కడ జరుగుతు న్న వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల కు హాజరయ్యేందుకు ఉత్తర కొరియా జనరల్ కిమ్ యాంగ్ చోల్ ఆధ్వర్యంలోని ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం ఉదయం సియోల్‌కు చేరుకుంది.