ఒబామా ప్రసంగం.. కాస్త వెరైటీగా! | President Obama previews his final State of the Union address | Sakshi
Sakshi News home page

ఒబామా ప్రసంగం.. కాస్త వెరైటీగా!

Jan 8 2016 7:33 PM | Updated on Sep 3 2017 3:19 PM

ఒబామా ప్రసంగం.. కాస్త వెరైటీగా!

ఒబామా ప్రసంగం.. కాస్త వెరైటీగా!

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చేవారం కాంగ్రెస్(అమెరికా ఉభయ సభలు)ను ఉద్దేశించి చివరిసారి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చేవారం కాంగ్రెస్(అమెరికా ఉభయ సభలు)ను ఉద్దేశించి చివరిసారి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. దేశంలో కొత్త ఏడాదిలో తీసుకురాబోయే చట్టాలు, ప్రభుత్వ విధానాలను ఈ ప్రసంగం(స్టేట్ ఆఫ్ ద యూనియన్ అడ్రస్)లో వివరించడం ఆనవాయితీ.

కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా ఒబామా ప్రసంగం సాగనుంది. దేశాన్ని శక్తిమంతంగా మార్చాలంటే ఏం చేయాలి? చిన్నారుల బంగారు భవిత కోసం ఏం చర్యలు తీసుకోవాలన్న అంశాలపై మాట్లాడనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement