థాయ్‌ ప్రధానిగా ప్రయూత్‌ చాన్‌ ఓచా

Prayut Chan O'Cha Elected As Thailand Prime Minister - Sakshi

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ప్రధానిగా సైనిక జుంటా పార్టీ అధినేత ప్రయూత్‌ చాన్‌ ఓచా(65) ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి, కోటీశ్వరుడైన థనాత్రోన్‌ జువాంగ్రోంగ్‌ రువాంకిట్‌పై ఆయన విజయం సాధించారు. ధాయ్‌లాండ్‌లో ప్రధానిని ఎన్నుకోవడానికి ప్రతినిధుల సభ, సెనెట్‌ కలిపి 350 సభ్యుల మద్దతు ఉండాలి. అయితే 250 మంది సభ్యులున్న సెనెట్‌లో జుంటా పార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఉండటంతో కౌంటింగ్‌ కొనసాగుతుండగానే ప్రయూత్‌ విజయం ఖరారైపోయింది.. 2014లో ఇంగ్లక్‌ షీనవ్రత ప్రభుత్వాన్ని సైన్యం కూలదోశాక అప్పటి ఆర్మీ చీఫ్‌ ప్రయూత్‌ చాన్‌ ఓచా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికతో సైనిక సంక్షోభం తర్వాత ఎన్నికైన తొలి పౌరప్రధానిగా ప్రయూత్‌ చాన్‌ ఓచా నిలిచారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top