గ్లూకోమాకు ముందస్తు చికిత్స.. 

Potential treatment to stop glaucoma in its tracks - Sakshi

కంటి వ్యాధి అయిన గ్లూకోమాను ముందుగానే నిరోధించేందుకు కాలిఫోర్నియా, టొరంటో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్న చికిత్స విధానాన్ని ఆవిష్కరించారు. సహజసిద్ధంగా లభించే లిపిడ్‌ మీడియేటర్స్‌ అనే కణాల ద్వారా గ్లూకోమాను నిరోధించవచ్చని గుర్తించారు. ఈ వ్యాధి వల్ల ఏటా కొన్ని లక్షల మంది చూపును కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కార్స్‌టెన్‌ గ్రోనెర్ట్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఎలుకలపై ప్రయోగాలు చేసింది.

శరీరంలోని ఆస్ట్రోసైట్స్‌ కణాలు స్రవించే లిపోక్సిన్‌ అనే రసాయనం కంటిలోని గాంగ్లియన్‌ కణాలు నాశనమైపోవడాన్ని అడ్డుకుంటున్నట్లు తెలుసుకున్నారు. లిపోక్సిన్లు వాపు/మంటలను తగ్గించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని ఇప్పటివరకూ అనుకునే వారు. ఇవే కణాలు గ్లూకోమా నివారణకూ ఉపయోగపడుతున్నాయని తమ ప్రయోగాల్లో తేలినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. లిపోక్సిన్‌ ద్వారా ఇతర నాడీ సంబంధిత వ్యాధుల్లోనూ మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.  
 

Back to Top