పార్కింగ్‌లో కూలిన విమానం | Plane Crashed At Parking Lot In California | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌లో కూలిన విమానం

Aug 6 2018 12:52 PM | Updated on Aug 6 2018 12:52 PM

Plane Crashed At Parking Lot In California - Sakshi

లాస్‌ ఏంజిల్స్‌ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చిన్న విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. శాంటా అనా నగరంలోని స్టాప్లెస్‌ సూపర్‌ సెంటర్‌ షాపింగ్‌ మాల్‌ పార్కింగ్‌లో విమానం కూలిందని అధికారులు వెల్లడించారు. విమానం పార్కింగ్‌లో ఉన్న ఓ కారును ఢీ కొట్టిందని వివరించారు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని ఓ కంపెనీ పేరిట విమానం నమోదు అయి ఉన్నట్లు వెల్లడించారు.

ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) వెల్లడించిన వివరాల ప్రకారం విమానం కాంకోర్డ్‌ సిటీ ఈస్ట్‌ బే సబర్బ్‌ నుంచి బయలుదేరి ఆరెంజ్‌ కౌంటీలోని జాన్‌ వేన్‌ విమానాశ్రయానికి చేరుకోవాల్సవుందని తెలిపారు. అయితే, సాంకేతిక సమస్య వల్ల షాపింగ్‌ మాల్‌ వద్ద కూలిందని చెప్పారు. పైలట్‌ ఎమర్జెన్పీ ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పటికీ విమానం క్రాష్‌ ల్యాండ్‌ అయ్యిందని పేర్కొన్నారు. ఘటనపై ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement