కరోనా ముందు ఏ ప్రేమైనా భారమే.. రోడ్లపైకి తోసేస్తున్నారు..!

People In China Throw Out Pets From Apartments Over Corona Virus Fear - Sakshi

వుహాన్‌: కరోనా వైరస్‌.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రస్తుతం ఈ వైరస్‌ భయభ్రాంతులకు గురిచేస్తోంది. చైనాలో తొలుత బయటపడ్డ ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికిస్తున్నది. ప్రస్తుతం ఇతర దేశాల్లోనూ కరోనా వైరస్‌ కేసులు బయట పడుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా పలుచోట్ల అనేక మంది మృతి చెందడంతో అన్ని దేశాలూ అప్రమత్తమై ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి.

అందులో భాగంగానే.. చైనాలో కరోనా వైరస్‌ జంతువుల నుంచి వ్యాపిస్తుందని నమ్మిన కొందరు వారు ప్రేమతో పెంచుకుంటున్న పెంపుడు జంతువులను కూడా ఏ మాత్రం ఆలోచించకుండా వదిలించుకుంటున్నారు. వ్యాధి సోకిన వారి దగ్గరకు వెళ్లొచ్చిన జంతువులను క్యారంటైన్‌లో ఉంచాలని మాత్రమే వైద్యులు సూచించారు. అయితే ఇది స్థానిక మీడియాలో మరో విధంగా ప్రచారం కావడంతో.. పెంపుడు జంతువుల వల్ల ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని చైనీస్‌ భావించారు.  (వుహాన్‌ నుంచి భారత్‌కు..)

ఈ నేపథ్యంలో ఎన్నో రోజులుగా తమతో ప్రేమతో పెంచుకుంటున్న కుక్కలను, పిల్లులను అపార్ట్‌మెంట్ల మీద నుంచి క్రిందకు తోసేస్తున్నారు. మనిషి ప్రాణాల మీద తీపితో వాటి ప్రాణాలను తీస్తున్నాడు. ఇలా మరణించిన పెంపుడు జీవాల దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవాలని మూగజీవాల ప్రాణాలు తీయవద్దని ప్రజలకు సూచించింది. ఇంట్లో పెంచుకునే కుక్కలు పిల్లులతో ఈ వ్యాధి సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రజలు ఆందోళన చెందొద్దని కోరుతోంది.  

(నిర్మానుష్య వీధిలో శవం.. భయం వేస్తోంది)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top