ఆకాశంలో అంతు చిక్క‌ని వ‌స్తువు! | Pentagon Decalers These Are Unidentified Aerial Phenomena | Sakshi
Sakshi News home page

ఆకాశంలో అంతు చిక్క‌ని వ‌స్తువు!

Apr 29 2020 8:26 AM | Updated on Apr 29 2020 3:49 PM

Pentagon Decalers These Are Unidentified Aerial Phenomena - Sakshi

వాషింగ్టన్‌ : గ్ర‌హాంత‌ర వాసులు, ఫ్ల‌యింగ్ సాస‌ర్స్‌ (గ్ర‌హాంత‌ర వాసులు వీటిని న‌డుపుతార‌ని ఊహాగానం) గురించి ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. ప్ర‌జల‌కూ వాటి గురించి తెలుసుకోవాల‌ని అమితాస‌క్తి. తాజాగా దీనికి సంబంధించి మూడు వీడియోల‌ను అమెరికా ర‌క్ష‌ణ సంస్థ పెంటగాన్‌ విడుద‌ల చేసింది. వీటిని "ఆకాశంలో గుర్తించ‌డానికి వీలులేని దృశ్యాలు" అని వ్యాఖ్యానించింది. ప్ర‌జ‌ల్లో ఉన్న అపోహ‌ల‌ను తొల‌గించ‌డానికే వీటిని రిలీజ్ చేశామ‌ని వెల్ల‌డించింది.  అయితే ఈ వీడియోలు అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లకు ఎలాంటి ఆటంకం క‌లిగించ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ఒక‌ వీడియోలో వ‌స్తువు లాంటిది ఆకాశంలో తిరుగుతోంది. (ట్రంప్‌ ఆదేశాలతోనే దాడి : వైట్‌ హౌస్‌)

దీన్ని విమానం న‌డుపుతున్న ఇద్ద‌రు నేవీ పైల‌ట్లు 2004లో కెమెరాల్లో బంధించారు. మ‌రో రెండు వీడియోల్లో గాలిలో ఏదో వ‌స్తువులాంటిది క‌ద‌ల‌డం క‌నిపిస్తుంది. వీటిని 2015లో చిత్రీక‌రించారు. అయితే ఈ వీడియోలు  2007, 2017లో సోషల్ మీడియాలో లీక‌వ‌గా ఇన్నేళ్ల త‌ర్వాత‌ అమెరికా ర‌క్ష‌ణ సంస్థ వీటిని ధృవీకరించ‌డంతో మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌స్తుతం ట్విట‌ర్‌లో ట్రెండింగ్‌గా నిలిచిన ఈ వీడియోపై నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. "ఏలియ‌న్స్ వ‌స్తున్నాయేమో.." అంటూ కొంద‌రు అనుమానం వెలిబుచ్చ‌గా, "అదేమై ఉంటుందో క్లారిటీ ఇస్తే బాగుండేద‌"ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. (ఈ వింత జీవి పేరేంటో మీకు తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement