మూత పడనున్న నగ్న రెస్టారెంట్‌

Paris First Nudist Restaurant To Close Down - Sakshi

పారీస్ : సమాజపు కట్టుబాట్లను కాసేపు పక్కనబెట్టి ఎంచక్కా నచ్చినట్లు నగ్నంగా రెస్టారెంట్‌లో గడపాలనుకునే వారికి స్వర్గధామంలాంటి ‘ఓ న్యాచురల్‌ రెస్టారెంట్ ’మూతపడనుంది. 2016లో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్‌ ప్రపంచంలోనే తొలి న్యూడ్ రెస్టారెంట్‌గా గుర్తింపు పొందింది. అప్పట్లో ఈ రెస్టారెంట్‌ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంది. ఒంటి మీద నూలుగు పోగు లేకుండా నగ్నంగా రావాలని కండీషన్ పెట్టడమే ఇందుకు కారణం.అయితే గిరాకీ లేకపోవడంతో ఫిబ్రవరిలో ఈ రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

ఫ్రాన్స్ రాజధాని పారీస్ కు చెందిన 43 ఏళ్ల ట్విన్స్ మైక్, స్టీఫెన్‌లు 2016లో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇందులో ఏమైనా తినాలంటే బట్టలు విప్పి లోపల అడుగు పెట్టాల్సిందే. ఫోన్లు, బట్టలు, కెమెరాలు లాంటివన్నీ పెట్టుకునేందుకు కస్టమర్లకు లాకర్లు కూడా ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ లోపలికి ఎటువంటి కెమెరాలనూ అనుమతించరు. ప్రకృతి ప్రేమికుల కోసం ఈ రెస్టారెంట్ ఓపెన్ చేశామని ట్విన్స్ మైక్, స్టీఫెన్‌లు పేర్కొన్నారు. అయితే కస్టమర్ల సంఖ్య తగ్గి నష్టం రావడంతో ఫిబ్రవరిలో రెస్టారెంట్‌ మూసివేస్తున్నామని యాజమాన్యం వెల్లడించింది.

‘ఓ న్యాచురల్ రెస్టారెంట్‌కు వచ్చే జనాల సంఖ్య విపరీతంగా తగ్గింది. పెట్టిన ఖర్చులో కేవలం 40 శాతం మాత్రమే రెవెన్యూ వస్తోంది. అందుకే ఫిబ్రవరిలో రెస్టారెంట్ మూసేస్తున్నాం. న్యూడ్ అనుభవం పొందాలనుకునేవారు త్వరగా వచ్చేయండి...’’అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు నిర్వాహకులు. అయితే నగ్నంగా వింధు చేసేందకు జనాలు సాహసించకపోవడంతో  ప్రపంచపు మొట్టమొదటి న్యూడ్‌ రెస్టారెంట్‌ కొద్దిరోజుల్లో చరిత్రలో కలిసి పోనుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top