తీర్పుకిది సరైన సమయం కాదు: పాక్‌

Pakistan Foreign Minister objects to timing of Ayodhya verdict - Sakshi

ఇస్లామాబాద్‌: ఓ వైపు కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ వ్యాఖ్యానించారు. ఈ చర్యతో తాను బాధకు గురయ్యానని చెప్పారు. సంతోషకరమైన సమయంలో ఇలాంటి సున్నిత అంశంపై తీర్పు సరి కాదని అన్నారు. సిక్కుల మత గురువైన గురునానక్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా మరికొంత కాలం ఆగి తీర్పు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు.

భారతీయ ముస్లింలు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారని, తాజా తీర్పుతో వారు మరింత ఒత్తిడికి లోనవుతారని అన్నారు. పాక్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌  ఈ తీర్పును అన్యాయపు తీర్పుగా అభివర్ణించారు. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ శాఖలో ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ అసిస్టెంట్‌ ఫిర్‌దౌస్‌ ఆషిఖ్‌ అవాన్‌ సుప్రీంకోర్టును కేంద్రం నడుపుతోందంటూ వ్యాఖ్యానిం చారు. ఓ వైపు పాక్‌ కర్తార్‌పూర్‌తో మైనారిటీల హక్కులకు రక్షణ కల్పిస్తుంటే, భారత్‌ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top