భారత అమెరికన్‌కు అరుదైన గౌరవం | New York City Mayor Declares Waris Ahluwalia Day at Diwali Celebration | Sakshi
Sakshi News home page

భారత అమెరికన్‌కు అరుదైన గౌరవం

Oct 21 2016 9:32 AM | Updated on Sep 4 2017 5:54 PM

అమెరికాలో భారత అమెరికన్, నటుడు, డిజైనర్‌ వారిస్‌ అహ్లువాలియాకు అరుదైన గౌరవం దక్కింది.

న్యూయార్క్‌: అమెరికాలో భారత అమెరికన్, నటుడు, డిజైనర్‌ వారిస్‌ అహ్లువాలియాకు అరుదైన గౌరవం దక్కింది. సహనశీలత, మత అవగాహనను సమర్థించటం, మతపరమైన  అజ్ఞానంపై పోరాడాలనే ప్రభావవంతమైన సందేశాన్ని ఇచ్చినందుకు అక్టోబర్‌ 19ను ‘వారిస్‌ అహ్లువాలియా డే’ గుర్తిస్తున్నట్లు న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ బే బ్లేసియో స్పష్టం చేశారు. దీపావళి వేడుకల సందర్భంగా అహ్లువాలియా నివాసంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మేయర్‌ ఈ ప్రకటన చేశారు.

తనకు ఈ గౌరవం దక్కడం పట్ల అహ్లువాలియా సంతోషం వ్యక్తం చేశారు. న్యూయార్క్ గొప్పనగరం అని ఆయన ప్రశంసించారు. అహ్లువాలియాకు అపూర్వ గౌరవం దక్కిందని న్యూయార్క్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ సిక్కు కొలియేషన్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement