పైసా ఖర్చులేని రాళ్ల వైద్యం భలే! | nature treatment in china with free of cost | Sakshi
Sakshi News home page

పైసా ఖర్చులేని రాళ్ల వైద్యం భలే!

Jul 8 2016 8:43 PM | Updated on Oct 20 2018 4:38 PM

పైసా ఖర్చులేని రాళ్ల వైద్యం భలే! - Sakshi

పైసా ఖర్చులేని రాళ్ల వైద్యం భలే!

ప్రకృతి వైద్యమంటే ఆకులను, బెరళ్లను పేస్ట్‌గా చేసి రాసుకోవడం గురించి తెలుసు. కొన్నిసార్లు మట్టిని ఒంటినిండా పూసుకొని కూడా వైద్యం చేస్తారు.

బీజింగ్: ప్రకృతి వైద్యమంటే ఆకులను, బెరళ్లను పేస్ట్‌గా చేసి రాసుకోవడం గురించి తెలుసు. కొన్నిసార్లు మట్టిని ఒంటినిండా పూసుకొని కూడా వైద్యం చేస్తారు. మరి ఎండకు వేడెక్కే బండలపై పడుకోబెట్టి చేసే ప్రకృతి వైద్యం గురించి మీకు తెలుసా? చైనాలో చాలామంది మహిళలు ఇప్పుడు ఇలాంటి వైద్యాన్నే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఎండలో.. కాలే రాళ్లపై పడుకుంటే ఎన్నో రకాల రోగాలు నయమవుతాయని అంటున్నారు.

ఈ వైద్యం కోసమని ముఖాలపై చిన్నపాటి టవల్‌నో, గుడ్డనో కప్పుకుని ఎండకు వేడెక్కిన పెద్ద పెద్ద రాళ్లను కౌగిలించుకుంటున్నారు. మరీ పెద్దరాయి దొరికితే దానిపై వెల్లకిలా పడుకుంటున్నారు. అక్కడ ఇదో పెద్ద ట్రెండ్‌గా మారిపోయింది. పైసా ఖర్చులేని వైద్యం కదా.. అందుకే  పార్కుల్లోనూ, ఎండ తగిలే ఖాళీ ప్రదేశాల్లోనూ ప్రత్యేకంగా పెద్ద పెద్ద రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 3-5 గంటల మధ్య గ్జియాన్ నగరంలో ఎక్కడ చూసినా ఇలా రాళ్లపై పడుకునేవారే కనిపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement