గ్రహశకలాలను పేల్చేసే.. స్పేస్ షాట్‌గన్ | NASA is developing a space shotgun to shoot asteroids | Sakshi
Sakshi News home page

గ్రహశకలాలను పేల్చేసే.. స్పేస్ షాట్‌గన్

Sep 22 2015 10:48 AM | Updated on Sep 3 2017 9:47 AM

గ్రహశకలాలను పేల్చేసే.. స్పేస్ షాట్‌గన్

గ్రహశకలాలను పేల్చేసే.. స్పేస్ షాట్‌గన్

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రపంచంలోనే తొలిసారిగా తొలి స్పేస్ షాట్ గన్‌ను అభివృద్ధి చేస్తోంది.

న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రపంచంలోనే తొలిసారిగా తొలి స్పేస్ షాట్ గన్‌ను అభివృద్ధి చేస్తోంది. భూమికి సమీపంలోని ఆస్టరాయిడ్‌ని ఈ షాట్‌గన్‌తో పేల్చడం ద్వారా ఏర్పడే చిన్న శకలాలను సేకరించి, పరిశోధించాలనే లక్ష్యంతో దీన్ని తయారుచేస్తోంది. ఆస్టరాయిడ్ రీడైరెక్ట్ మిషన్(ఏఆర్‌ఎమ్)లో భాగంగా నాసా షాట్‌గన్ తయారీపై దృష్టిసారించిందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.

ఆస్టరాయిడ్‌లోని భారీ భాగాన్ని వేరు చేసి, దాన్ని చంద్రుడి కక్ష్యలోకి పంపించి, అక్కడి నుంచి తదుపరి పరిశోధనల కోసం మానవ సహిత వ్యోమనౌక ద్వారా భూమికి చేర్చడం ఆస్టరాయిడ్ రీడైరెక్ట్ మిషన్ ప్రధాన లక్ష్యం. 'ఆస్టరాయిడ్స్.. ఓ హాట్ టాపిక్. భూమికి ప్రమాదం తెస్తాయని మాత్రమే కాదు, వాటికున్న శాస్త్రీయ విలువ ఆధారంగా కూడా. అంగారకుడి దిశగా నాసా ప్రయత్నాల్లో ఇది ఒక ముందడుగు' అని నాసా ప్లానెటరీ సైన్స్ డైరెక్టర్ గ్రీన్ జిమ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement