మెల్లగా వచ్చి.. చల్లగా బాత్రూంలో నిద్రపోయింది

Mountain Lion Lies Down In Bathroom California House - Sakshi

కాలిఫోర్నియా : రాత్రివేళ ఓ ఇంట్లోకి ప్రవేశించిన పర్వత సింహం అక్కడి బాత్రూంలో చల్లగా నిద్రపోయింది. కొన్ని గంటలపాటు ఆ ఇంట్లో వారిని భయాందోళనకు గురిచేసింది. ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కాలిఫోర్నియాలోని టులోమ్నే కౌంటీ అనే ప్రాంతంలోని పర్వతాలనుంచి రాత్రివేళ ఓ సింహం దగ్గరలోని ఇంట్లోకి ప్రవేశించింది. కొద్దిసేపు ఇంట్లో కలియతిరిగింది. అక్కడి బాత్రూంలో చల్లగా ఉండటంతో అక్కడే నిద్రపోయింది.  ఆ ఇంటి సభ్యుడొకరు పొద్దున్నే బాత్రూం దగ్గరకు వెళ్లాడు. బాత్రూంలోకి అడుగు పెడుతుండగా అక్కడ సింహం నిద్రపోయి ఉండటం చూశాడు.

అంతే అతి గుండె ఝల్లుమంది. వెంటనే చప్పుడు చేయకుండా అక్కడినుంచి వెనక్కు వచ్చి మిగిలిన ఇంటి సభ్యులకు విషయం చెప్పాడు. దీంతో వెంటనే వారు ‘‘ఫిష్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌’’ అధికారులకు సమాచారమిచ్చారు. వైల్డ్‌లైఫ్‌ అధికారులు, పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడేసరికి సిం‍హం నిద్రలేచింది. అక్కడినుంచి పారిపోవాలని చూసింది కానీ, కుదరలేదు. కొన్ని గంటల పాటు శ్రమించిన అధికారులు అతి కష్టం మీద దాన్ని బాత్రూం కిటికిలోంచి సురక్షితంగా బయటకు పంపగలిగారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top