క‌రోనా : వ్యాక్సిన్ అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చు

Most Of Us Wont Need Covid-19 Vaccine Says Oxford Professor - Sakshi

లండ‌న్ : మ‌న‌లో చాలామందికి కోవిడ్ వ్యాక్సిన్ అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, వైర‌స్ దానంత‌ట అదే స‌హ‌జంగా స‌మసిపోతుంద‌ని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటి ఫ్రొఫెస‌ర్, ఎపిడెమియాలజిస్ట్ సునేత్రా గుప్తా అభిప్రాయ‌ప‌డ్డారు. వృద్ధులు, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారిలోనే కోవిడ్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుందని, మిగ‌తా వారికి ఒక‌వేళ సోకినా త్వ‌ర‌గానే కోలుకుంటున్నార‌ని తెలిపారు. క‌రోనాను సాధార‌ణ ఫ్లూ లాగే  చూడాల‌ని, అన‌వ‌సంగా ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని  పేర్కొన్నారు. స్పానిష్ ఇన్ ఫ్లూయెంజా మాదిరిగానే క‌రోనా కూడా మ‌న జీవితంలో భాగ‌మ‌వుతుంద‌ని అయితే ఈ ఏడాది చివ‌రి నాటికి వ్యాక్సిన్ వ‌స్తుందని గుప్తా ఆశాభావం వ్య‌క్తం చేశారు. (మనుషులపై పని చేస్తున్న వ్యాక్సిన్​)

 'ఇన్ ఫ్లూయెంజా కంటే క‌రోనా చాలా న‌యం. క‌రోనా మ‌ర‌ణాల రేటు చూస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. 1918లో వ‌చ్చిన ఇన్ ఫ్లూయెంజా కార‌ణంగా 50 మిలియ‌న్ వ‌ర‌కు ప్రాణాలు కోల్పోతే 5 కోట్ల మందికి ఈ వైర‌స్ సోకింది. దీన్ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది క‌దా  ప్ర‌స్తుతం మ‌నం ఎంతో ఆందోళ‌న చెందుతున్న క‌రోనా పెద్ద ప్ర‌మాద‌కర‌మేమి కాద‌ని. అయిన‌ప్ప‌టికీ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం ముఖ్య‌మే అలా అని అన‌వ‌రంగా ఆందోళ‌న చెందాల్సిన పనిలేదు' అని వివ‌రించారు. 

క‌రోనాను నియంత్రించ‌డానికి లాక్‌డౌన్ ఒక్క‌టే ప‌రిష్కారం కాదని, దీని వల్ల దీర్ఘ‌కాలికంగా క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం సాధ్యం కాద‌ని గుప్తా పేర్కొన్నారు. పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని అంతేకాకుండా ఎక్కువ రోజుల‌పాటు లాక్‌డౌన్ విధించ‌డం సాధ్యం కాద‌ని తెలిపారు. మొద‌టిద‌శ‌లో లాక్‌డౌన్‌ను విజ‌య‌వంతంగా అమ‌లుచేసిన దేశాలు కూడా ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయ‌న్నారు. (నిషేధం నిబంధనలకు విరుద్ధం: చైనా )

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top