నెలల బుడ్డోడి విన్యాసం.. వైరల్ వీడియో | months boy miracle at swimming pool | Sakshi
Sakshi News home page

నెలల బుడ్డోడి విన్యాసం.. వైరల్ వీడియో

Nov 3 2017 2:06 PM | Updated on Jul 26 2018 5:23 PM

months boy miracle at swimming pool - Sakshi

సిడ్నీ : ఓ తల్లి తన నెలల బుజ్జాయి ఈత కొలనులో చేసిన అద్భుత విన్యాసాన్ని ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. పెర్త్‌కు చెందిన రోక్షాన్నే టర్నర్ కు సంతానం తొమ్మిది నెలల బాబు మ్యాక్స్. తన బాబుకు స్మిమ్మింగ్ నేర్పించాలని భావించిన టర్నర్ స్మిమ్మింగ్ పూల్ కు మ్యాక్స్ ను తీసుకెళ్లింది.

ఈత నేర్పించే ట్రైనర్ డైరాకు చిన్నారి మ్యాక్స్ కు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఇటీవల స్మిమ్మింగ్ కు తల్లితో కలిసి వెళ్లాడు మ్యాక్స్. పుల్‌లో పడేసిన తర్వాత సొంతంగా వెల్లకిలా ఎలా మారాలో, నీటిపై ఎలా తేలియాడాలో ట్రైనర్ డైరా నేర్పించారు. ట్రైనర్ రెండు చేతులతో మ్యాక్స్‌ను కొలనులో వేయగా తన కుమారుడు చేసిన విన్యాసాన్ని వీడియో తీసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. పేరెంట్స్ అందరూ ఈ వీడియో చూడాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.



Advertisement
 
Advertisement
Advertisement