నా గత జీవితం దారుణమైంది : పోర్న్‌ స్టార్‌

Mia Khalifa Says I Made Just Rs 9 Lakh As Adult Star - Sakshi

లెబెనాన్‌ : మూడు నెలల నీలి జీవితం.. అగ్ర శృంగార తారగా పేరు.. ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులనుంచి బెదిరింపులు.. ఇదీ మాజీ ఫోర్న్‌ స్టార్‌ మియా ఖలీఫా నీలి నట జీవితం. నీలి చిత్రాల నటనకు గుడ్‌బై చెప్పిన తర్వాత తన గత జీవితం గురించి మాట్లాడటానికి ఆమె ఇష్టపడలేదు. మీడియాకు సైతం దూరంగా ఉన్నారామె. కానీ, మొదటిసారి తన గత జీవిత సంగతులను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ‘నేను బ్లూ ఫిల్మ్స్‌లో నటించటం ద్వారా చాలా డబ్బు సంపాదించి ఉంటానని అందరూ అనుకుంటుంటారు. కానీ, నేను సంపాదించింది కేవలం రూ. 9  లక్షల రూపాయలు మాత్రమే. కొంతమంది స్వార్థపరులు మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని వారిని చట్టబద్ధమైన కాంట్రాక్టుల ద్వారా నీలి చిత్రాల్లో నటించేలా చేస్తున్నారు. నా గతం గురించి నేను నిజాలు మాట్లాడినా.. అది నా భవిష్యత్తును ఇబ్బందుల్లో పడేస్తుంది.

అందుకే ఇన్నేళ్లపాటు నా గత జీవితం గురించి మాట్లాడలేదు.  అయితే ఇప్పుడు వాటిని చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా గత జీవితాన్ని దాచుకోకుండా చెప్పినప్పుడే అది నన్ను బాధించకుండా ఉంటుంది. నేను శృంగార చిత్రాల్లో నటించింది మూడు నెలలే అయినా, అది నా జీవితాన్ని చాలా ఇబ్బందుల్లో పడేసింది. ఓ వీడియో కారణంగా ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదుల నుంచి చావు బెదిరింపులు ఎదుర్కొన్నాను. దాని కారణంగా బయటకు రాలేని పరిస్థితి! ఓ రెండు వారాలు హోటల్‌ గదిలో తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పుడు కొంతమంది నన్ను సపోర్ట్‌ చేస్తూ.. మరి కొందరు నన్ను వ్యతిరేకిస్తూ సందేశాలు పంపారు. ప్రజలు నా గురించి ఆలోచిస్తున్న సంగతే నాలో మార్పు తెచ్చింది. నా గత జీవితం గురించి నేనేమీ గర్వపడటం లేదు. ప్రజలు నన్ను వాళ్లలో ఒక దానిగా భావించేవరకు నేను ఎదురు చూస్తుంటాను’ అని అన్నారు. మియా 2014 అక్టోబర్‌లో నీలి చిత్రాల నటనను ప్రారంభించి 2015 జనవరిలో దాని నుంచి బయటకు వచ్చేశారు. అందులో పనిచేసింది కొద్ది రోజులే అయినా ప్రపంచ అగ్ర శృంగార తారగా నేటికీ వెలుగొందుతున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top