సారీ.. మాస్టారూ.. | Mastar .. sorry .. | Sakshi
Sakshi News home page

సారీ.. మాస్టారూ..

Sep 13 2014 2:46 AM | Updated on Sep 2 2017 1:16 PM

సారీ.. మాస్టారూ..

సారీ.. మాస్టారూ..

మన సన్నిహితులను అనవసరంగా తిట్టేశాం లేదా మన మాటలతో వారిని నొప్పించాం.. సారీ చెప్పాలి. కానీ ఈగో అడ్డొస్తోంది. మరెలా? జపాన్‌లో అయితే దీనికో సులువైన పరిష్కారం ఉంది.

మన సన్నిహితులను అనవసరంగా తిట్టేశాం లేదా మన మాటలతో వారిని నొప్పించాం.. సారీ చెప్పాలి. కానీ ఈగో అడ్డొస్తోంది. మరెలా? జపాన్‌లో అయితే దీనికో సులువైన పరిష్కారం ఉంది. ఎందుకంటే.. ఇక్కడ మన తరఫున క్షమాపణలు చెప్పేందుకూ ప్రత్యేకమైన సంస్థలున్నాయి! ఈ అపాలజీ ఏజెన్సీలకు కొంత మొత్తం ముట్టజెబితే.. మన తరఫున వారు సారీ చెబుతారన్నమాట. ఇందుకోసం సదరు సంస్థలు తమ సిబ్బందికి ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తాయి. వారు పక్కా ప్రొఫెషనల్స్ అట. పరిస్థితి తీవ్రతను బట్టి క్షమాపణలు చెప్పే విధానాల్లో తేడాలుంటాయి. ఇందులో బోరున ఏడుస్తూ.. సారీ చెప్పే విధానమూ ఉంది. కొన్నిసార్లయితే.. ఈ సంస్థ తరఫున సారీ చెప్పడానికి వెళ్లేవారు.. వారు మన బంధువో లేక స్నేహితుడో అని అవతలవాళ్లకు చె ప్పి.. మనం చాలా బాధపడుతున్నామని.. అందుకే మన తరఫున సారీ చెప్పడానికి వచ్చామని నమ్మిస్తారు.

ఇలా చేయడం మోసమంటూ పలువురు ఈ సంస్థలను విమర్శిస్తున్నా.. వీరి బిజినెస్  తగ్గడం లేదు. వీరికి వచ్చేవి కూడా ఎక్కువగా ప్రేమ వ్యవహారాలే ఉంటున్నాయట. నేరుగా మనిషిని పంపి సారీ చెప్పాలంటే రూ.15 వేలు, ఫోన్,ఈమెయిల్ ద్వారా క్షమాపణలకు రూ.5 వేలు వసూలు చేస్తామని  షాజాయియా ఐగా ప్రో ఏజెన్సీ సంస్థ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement