రెండోసారి లాట‌రీ: కోట్లు సొంతం..

Man Won 4 Million Dollars In Lottery Second Time In Michigan - Sakshi

మిచిగాన్‌: లాట‌రీ గెలుచుకోవాల‌న్న‌ది ఎంతోమంది క‌ల‌. జీవితంలో ఒక్క‌సారైనా దాన్ని గెలుచుకుంటే చాల‌నుకునేవారు కోట్లల్లో ఉంటారు. కానీ ఓ వ్య‌క్తికి మాత్రం ఒక్క‌సారేంటి, రెండుసార్లు లాట‌రీ త‌గిలింది. దీంతో అత‌ని ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన మార్క్ క్లార్క్ అనే వ్య‌క్తి 2017లో లాట‌రీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా ఆ లాట‌రీ టికెట్‌ను ప‌దేళ్ల క్రితం చ‌నిపోయిన‌ తండ్రి కానుక‌గా ఇచ్చిన నాణెంతో గీకి చూడ‌గా ఆ నంబ‌ర్ లాట‌రీ గెలుచుకుంది. దీంతో అక్ష‌రాలా నాలుగు మిలియ‌న్ డాల‌ర్లు(30 కోట్ల రూపాయ‌లు) అత‌డి సొంత‌మైంది. ఈ విష‌యాన్ని అక్క‌డి అధికారులు సోమ‌వారం ధృవీక‌రించారు. కాగా అతడు లాట‌రీ గెలుపొందండం ఇది రెండోసారి కావ‌డం విశేషం. ఇక‌ క్లార్క్‌ ముందు లాట‌రీ నిర్వాహ‌కులు రెండు ఆప్ష‌న్‌లు ప్ర‌వేశ‌పెట్టారు. (చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది)

దీర్ఘ కాలంలో 4 మిలియ‌న్ డాల‌ర్లు తీసుకుంటారా? లేదా త‌క్ష‌ణ‌మే 2.5 మిలియ‌న్ డాల‌ర్లు తీసుకుంటారా? అని ప్ర‌శ్నించారు. దీనికి అత‌డు డ‌బ్బులు అందుకోడానికి ఎక్కువ కాలం వేచి చూడ‌లేనంటూ 2.5 మిలియ‌న్ డాల‌ర్లు (18,95,18,750 కోట్ల రూపాయ‌లు) అందుకు‌న్నాడు. ఈ సంద‌ర్భంగా అత‌డు మీడియాతో మాట్లాడుతూ.. "నా సంతోషాన్ని మాట‌ల్లో చెప్ప‌లేక‌పోతున్నా.. కానీ నేను మ‌ళ్లీ లాట‌రీ గెలిచానంటే అందుకు ఈ నాణెం కార‌ణ‌మ‌ని భావిస్తున్నా. జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూశాను. కానీ ఇప్పుడు ద‌శ తిరిగిపోయిన‌ట్లు అనిపిస్తోంది" అని పేర్కొన్నాడు. (ఇదీ లక్‌ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top