సూట్‌కేస్‌లో 50 పాములు | Man detained in eastern China for trying to bring 50 poisonous snakes | Sakshi
Sakshi News home page

సూట్‌కేస్‌లో 50 పాములు

Oct 3 2017 3:53 AM | Updated on Oct 22 2018 2:22 PM

Man detained in eastern China for trying to bring 50 poisonous snakes - Sakshi

బీజింగ్‌: విషపూరితమైన 50 పాములను సూట్‌కేస్‌లో రవాణా చేసేందుకు యత్నిం చిన ఓ వ్యక్తిని చైనాలోని ఓ రైల్వేస్టేషన్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి సూట్‌కేస్‌లో బరువైన వస్తువు ఒకదానిని మడత పెట్టినట్లుగా రైల్వేస్టేషన్‌ లోని స్కానర్‌లో కనిపించింది.

దీంతో అనుమానం వచ్చి సూట్‌కేస్‌ను తనిఖీ చేయగా, అందులో 4 కేజీల పాములు కనిపించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం పాములను అటవీ అధికారులకు అప్పగించారు. పాములు పిట్‌ వైపర్‌ జాతికి చెందినవి.  స్నేక్‌ వైన్‌ తయారుచేయటం కోసం పాములను కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement