మళ్ళీ ఆ సెల్ఫీలతో కిమ్ కర్దాషియాన్..! | Kim Kardashian poses naked for selfies | Sakshi
Sakshi News home page

మళ్ళీ ఆ సెల్ఫీలతో కిమ్ కర్దాషియాన్..!

Sep 17 2016 10:43 AM | Updated on Sep 4 2017 1:53 PM

మళ్ళీ ఆ సెల్ఫీలతో కిమ్ కర్దాషియాన్..!

మళ్ళీ ఆ సెల్ఫీలతో కిమ్ కర్దాషియాన్..!

కిమ్ కర్దాషియాన్ తన నగ్న సెల్ఫీలతో మరోమారు వార్తలకెక్కింది.

మియామీః హాలీవుడ్ శృంగార తార, రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ తన నగ్న సెల్ఫీలతో మరోమారు వార్తలకెక్కింది. సోషల్ మీడియా వేదికగా సెల్ఫీలు పోస్టు చేయడంలో పేరొందిన ఆమె..  తాజాగా తన చర్మ సౌందర్యాన్ని ప్రతిబింబించేట్టు తీసుకున్ననగ్న సెల్ఫీలను షేర్ చేసి అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నించింది.

ఇటీవల సుమారు 31 కిలోల వరకూ బరువు తగ్గించుకొని మరింత స్లిమ్ గా తయారైన కిమ్... శరీరంపై నూలుపోగు లేకుండా ఓ హోటల్ గదిలో స్వీయ చిత్రాలకు పోజిచ్చింది. అంతేకాక వాటిని సామాజిక మాధ్యమంలో షేర్ చేయడం మరోమారు హాట్ టాపిక్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లలో ఆమె పోస్టు చేసిన లేటెస్ట్ ఫోటోల్లో కిమ్.. పూర్తి శాతం నగ్నంగా కనిపిస్తోంది. అయితే కొన్ని శరీర భాగాలను మాత్రం చేతులతో కవర్ చేసిన ఈ సెల్ఫీ సుందరి.. ముఖానికి సెల్ ఫోన్ అడ్డుపెట్టి పాక్షికంగా కనపడేట్లు పోజిచ్చింది.

సెక్సీ పోలారాయిడ్ ఫోటోలే తనకు స్ఫూర్తినిచ్చాయని గతంలో కిమ్ కర్దాషియాన్ చెప్పిన విషయం తెలిసిందే. మార్చి నెలలో ఓసారి సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోలను షేర్ చేసి హల్ చల్ చేసిన ఈ 35 ఏళ్ళ ముద్దుగుమ్మ.. వార్తల్లో ప్రధానాంశంగా నిలవడంతో.. ఆమె వైఖరి పట్ల సహ నటులు క్లో మోరెట్జ్, బెట్టే మిడ్లర్ సైతం తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement