‘టాయిలెట్‌’ తెచ్చుకున్న కిమ్‌

Kim Jong Un Brings Toilet To Singapore - Sakshi

సింగపూర్‌ : ప్రపంచంలో చాలా దేశాల అధ్యక్షులు ఉన్నా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. విలక్షణమైన చేష్టలతో ఆయన తరచూ వార్తల్లోకి వస్తుంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కిమ్‌ సింగపూర్‌లో భేటీ అయ్యారు. ఇందుకోసం సింగపూర్‌ వచ్చిన కిమ్‌ ఆయన వెంట ఒక టాయిలెట్‌ను తీసుకొచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటకు పొక్కకుండా చూసుకునేందుకే ఇలా చేశారని తెలుస్తోంది. కిమ్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని సదరు కథనం పేర్కొంది. స్థూలకాయత్వంతో బాధపడుతున్న కిమ్‌కు ఫాటీ లివర్‌ ఉందని, మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల వాతం కూడా ఉన్నాయని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ పత్రిక ఒకటి పేర్కొంది.

వీటన్నింటిని పాశ్చాత్య మీడియా దృష్టిలో పడకుండా చూసుకునేందుకే ప్రత్యేక మొబైల్‌ టాయిలెట్‌ను కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సింగపూర్‌కు తన వెంట తెచ్చుకున్నారని వెల్లడించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top