
శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్ నుంచి వైదొలుగుతున్నట్లు వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ ప్రకటించారు. నాలుగేళ్ల క్రితం వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం కౌమ్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ‘బ్రియాన్, నేను కలసి వాట్సాప్‌ను స్థాపించి దాదాపు దశాబ్దం గడిచింది.
ఫేస్‌బుక్ నుంచి బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తనతో ఇన్నాళ్లూ కలసి పనిచేస్తూ ఎన్నో విషయాలు బోధించినందుకు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ కౌమ్‌కు ధన్యవాదాలు చెప్పారు.