
టోక్యో: ఎన్‌హెచ్‌కే సంస్థకు చెందిన రిపోర్టర్ మివా సాడో(31) ఓవర్ డ్యూటీ (అధిక పనివేళలు) కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సాడో మృతి చెందిన నాలుగేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టోక్యోలో రాజకీయ వార్తలను సేకరించే మివా సాడో నెల రోజుల్లో 159 గంటల ఓవర్ డ్యూటీ చేసి .. 2013, జూలై లో ప్రాణాలు విడిచాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సాడోతల్లిదండ్రుల ఒత్తిడితో నాలుగేళ్ల తర్వాత ఆ కేసును ఎన్‌హెచ్‌కే బయటపెట్టింది.