వారు మహాముదుర్లు గురూ..! | Jail inmates now getting drug-soaked paper through mail, jails moving to stop it | Sakshi
Sakshi News home page

వారు మహాముదుర్లు గురూ..!

Mar 11 2016 2:31 PM | Updated on May 25 2018 2:29 PM

వారు మహాముదుర్లు గురూ..! - Sakshi

వారు మహాముదుర్లు గురూ..!

మత్తుపదార్థాల రవాణాలో వచ్చినన్ని టెక్నిక్స్‌ మరే ఇతర రంగంలో ఇప్పటి వరకు రాలేదు. ఎప్పటికప్పుడూ వారు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు విస్తుపోయే మార్గాలు అనుసరస్తూనే ఉంటారు.

న్యూయార్క్: మత్తుపదార్థాల రవాణాలో వచ్చినన్ని టెక్నిక్స్‌ మరే ఇతర రంగంలో ఇప్పటి వరకు రాలేదు. ఎప్పటికప్పుడూ వారు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు విస్తుపోయే మార్గాలు అనుసరస్తూనే ఉంటారు. ఇక మత్తుపదార్థాలకు బానిసైనవారి పరిస్థితి కూడా అంతే.. ఎన్ని తిప్పలు పడైనా తమకు కావాల్సిన మత్తుపదార్థాలు తెప్పించుకుంటారు.

వర్జినీయా జైలులో ఉంటున్న ఖైదీల విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే వారు తమకు మత్తు పదార్థాల కోసం అనుసరిస్తున్న మార్గాలు మాములువి కాదు. కనిపించేందుకు సాధారణంగానే ఉన్నా దాని లోతుల్లోకి వెళితే అవాక్కవ్వాల్సిందే. ఈ  మధ్యకాలంలో వర్జినీయా జైలులో ఖైదీలంతా ఆన్ లైన్ లో విహరిస్తూ పెద్ద మొత్తంలో పేపర్లకు, ఫొటోలకు ఆర్డరిస్తున్నారు.

అది కూడా మత్తుపదార్థాలకు బానిసైనవారికి ఉపశమనం కల్పించే సబాక్సన్ అనే మెడిసిన్ ఖాళీ ప్యాకెట్లు, ఆ ప్యాకెట్ ను ముద్రించిన ఫొటోల కోసం. అయితే, ఖాళీ పేపర్లు ఏం చేసుకుంటారా అని అనుకుంటున్నారా అలా అనుకుంటే మాత్రం పొరబడ్డట్లే.. ఎందుకంటే ఆ ఫొటోలు, పేపర్లు సాధారణమైనవి కాదు. పూర్తిగా డ్రగ్స్లో నానబెట్టినవి.

సాధారణంగా తెల్లపేపర్ను డ్రగ్స్ లో నానబెడితే అది పసుపురంగులో పేరుకు పోయి కనిపిస్తుంది. కానీ, ఫొటోల్లో, ఇతర చిత్రాలతో ముద్రించిన ప్యాకెట్లపై మాత్రం అది కనిపించదు. ఈ టెక్నిక్ రహస్యాన్ని తెలిసిన డ్రగ్ బానిసలు, డ్రగ్ సప్లయ్ దారులు విరివిగా వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ విషయం తెలిసిన జైలు శాఖ అధికారులు షాక్ తిన్నారు. ప్రస్తుతానికి అలాంటివాటి ఆర్డర్లను నిషేధించి నిబంధనలు కఠినం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement