దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా జాకబ్ జుమా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. శనివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా జాకబ్ జుమా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. శనివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని ప్రిటోరియాలోని అధికార నివాసం యూనియన్ బిల్డింగ్స్ ఎదుట జరిగిన ఈ కార్యక్రమానికి వందలాదిమంది విదేశీ ప్రతినిధులు తరలివచ్చారు. దక్షిణాఫ్రికా చీఫ్ జస్టిస్ మొగోంగ్ జుమా చేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జుమా ఐదేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.