ఈ మందుతో చెడు అలవాట్లు దూరం | isradipine use and far bad habits | Sakshi
Sakshi News home page

ఈ మందుతో చెడు అలవాట్లు దూరం

Jun 25 2015 5:49 PM | Updated on Oct 17 2018 4:36 PM

ఈ మందుతో చెడు అలవాట్లు దూరం - Sakshi

ఈ మందుతో చెడు అలవాట్లు దూరం

పలు రకాల మత్తు పదార్థాలకు బానిసలై వాటి నుంచి బయటపడలేకపోతున్న బాధితులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు.

న్యూయర్క్: పలు రకాల మత్తు పదార్థాలకు బానిసలై వాటి నుంచి బయటపడలేకపోతున్న బాధితులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారందరికీ ఒక శుభవార్త. రక్తపోటును అదుపులో ఉంచడానికి ఉపయోగించే ఇస్రాడైపైన్ అనే ఔషధం కొకైన్, ఆల్కహాల్.. దురలవాట్లను మాన్పించేందుకు కూడా సమర్థవంతంగా ఉపయోగపడుతుందని న్యూయార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఇలాంటి అలవాట్లకు అనుకూలంగా మెదడుపై పడిన ముద్రలను చెరిపేసి.. ఆ అలవాట్లను దూరం చేసేలా ఈ ఔషధం పనిచేస్తుందని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరో సైంటిస్ట్ హితోషి మొరికవా వెల్లడించారు. దీన్ని తొలిసారిగా ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయని అన్నారు. మెదడులోని నరాల పనితీరు, జ్ఞాపకశక్తి పెరుగుదలకు కూడా ఈ మెడిసిన్ దోహదపడుతోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement