ఐఎస్ ఉగ్రవాదుల జీతాలు కట్ | Islamic State decides to cut salaries of its fighters by half | Sakshi
Sakshi News home page

ఐఎస్ ఉగ్రవాదుల జీతాలు కట్

Jan 20 2016 10:50 AM | Updated on Sep 3 2017 3:59 PM

ఐఎస్ ఉగ్రవాదుల జీతాలు కట్

ఐఎస్ ఉగ్రవాదుల జీతాలు కట్

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో పనిచేసే ఫైటర్ల జీతాల్లో కోతపడనుంది. ఫైటర్ల జీతాలను సగానికి తగ్గించాలని ఐఎస్ ఉగ్రవాద సంస్థ నిర్ణయించింది.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో పనిచేసే ఫైటర్ల జీతాల్లో కోతపడనుంది. ఫైటర్ల జీతాలను సగానికి తగ్గించాలని ఐఎస్ ఉగ్రవాద సంస్థ నిర్ణయించింది. అనూహ్య పరిణామాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే కారణాలేంటన్నది బయటపెట్టలేదు. ఆర్థిక సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జెరూసలెం పోస్ట్ ఈ వివరాలను వెల్లడించింది.

ఇటీవల ఇరాక్లోని మెసుల్ నగరంలో ఐఎస్ సంస్థ ఖజానాపై అమెరికా సారథ్యంలోని సేనలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడిలో లక్షలాది డాలర్లు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో ఫైటర్ల జీతాలు తగ్గించడంతో పాటు పన్నుల ద్వారా స్థానిక పౌరుల నుంచి నిధులు వసూలు చేయాలని ఐఎస్ నిర్ణయం తీసుకుంది. గత డిసెంబర్తో పోలిస్తే ఐఎస్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్టు జెరూసలెం పోస్ట్ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement