అందర్ని చంపేస్తానంటున్న ఐదేళ్ల పిల్లాడు | ISIS execution video of five 'British spies' stars young boy from UK | Sakshi
Sakshi News home page

అందర్ని చంపేస్తానంటున్న ఐదేళ్ల పిల్లాడు

Jan 4 2016 6:37 PM | Updated on Sep 3 2017 3:05 PM

అందర్ని చంపేస్తానంటున్న ఐదేళ్ల పిల్లాడు

అందర్ని చంపేస్తానంటున్న ఐదేళ్ల పిల్లాడు

ఇస్లాం మతాన్ని విశ్వసించని మీ అందరిని చంపేస్తా’ అంటూ ఓ ఐదేళ్ల పిల్లాడు బ్రిటన్ పౌరులు, ప్రభుత్వాన్ని ఉద్దేశించి బ్రిటన్ యాసలోనే హెచ్చరించే తాజా ప్రాపగాండ వీడియోను ఐసీస్ టెర్రరిస్టులు విడుదల చేశారు.

 సిరియా: ‘ఇస్లాం మతాన్ని విశ్వసించని మీ అందరిని చంపేస్తా’  అంటూ ఓ ఐదేళ్ల పిల్లాడు బ్రిటన్ పౌరులు, ప్రభుత్వాన్ని ఉద్దేశించి బ్రిటన్ యాసలోనే హెచ్చరించే తాజా ప్రాపగాండ వీడియోను ఐసీస్ టెర్రరిస్టులు విడుదల చేశారు. అందులో నారింజ పండు దుస్తులు ధరించిన ఐదుగురు బ్రిటన్ గూఢచారులను పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి మిలటరీ దుస్తులు ధరించిన  టెర్రరిస్టులు  నిర్ధాక్షిణ్యంగా చంపడాన్ని, బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్‌ను ఉద్దేశించి తీవ్రమైన హెచ్చరికలు చేయడం లాంటి దృశ్యాలు ఉన్నాయి.

ఆ వీడియోలో ట్రెయిలర్‌గా చూపించిన పార్ట్‌లో దానిలో మతాన్ని విశ్వసించని వారందరినీ చంపేస్తానంటూ ఐదేళ్ల పిల్లాడు బెదిరించడం కనిపించింది. అలాగే ఓ బందీని కెమెరా ముందు ఆ పిల్లాడే చంపినట్లు స్ఫురించే దృశ్యం కూడా ఉంది. ట్రెయిలర్‌గా చూపించిన ఈ వీడియోను  టెర్రరిస్టులు  త్వరలోనే విడుదల చేయనున్నట్టు అర్థమవుతోంది. మొత్తం పది నిమిషాల నిడివిగల ఈ వీడియోలో డేవిడ్ కామెరాన్‌ను ఉద్దేశించి  టెర్రరిస్టులు  తీవ్రమైన హెచ్చరిక వ్యాఖ్యలు చేశారు.

 ‘శ్వేత భవనం బానిస. యూదుల ఆడ గాడిదైన కామెరాన్ నీకిదే సందేశం’ అంటూ ఇంగ్లీషులో హెచ్చరిస్తూ ఓ  టెర్రరిస్టు బ్రిటన్ గూఢచారులను కాల్చివేశారు. అంతకుముందు ఆ గూఢచారులు తాము నిజంగా గూఢచారులమేనని, బ్రిటన్ ప్రభుత్వం తరఫున ఐసీస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నామని అంగీకరించడం వీడియోలో కనిపించింది.

 ‘ఓ మూర్ఖుడా సిరియాలోని ఐసీస్ లక్ష్యాలపై బ్రిటీష్ వైమానికి దాడులు జరపుతున్నందుకు మీ పిల్లలు తగిన మూల్యం చెల్లిస్తారు. నీలాంటి అర్భకుడు ఓ ఇస్లాం రాజ్యాన్ని సవాల్ చేయడమా? చిన్న ద్వీపానికి చెందిన మీరు కేవలం గుప్పెడు విమానాలతో అతి విశాల ప్రపంచాన్ని ఆవహించిన మమ్మల్ని బెదిరించడం ఎంత సాహసం! నీవు నీ పూర్వ నాయకులు టోనీ బ్లేర్, గోర్దన్ బ్రౌన్ లాగే తల బిరుసుగల మూర్ఖుడివి. షరియా చట్టం కింద ప్రజలు భద్రంగా ఉన్నా, అల్లా సుప్రీం చట్టాలు అమలవుతున్న భూమికి వ్యతిరేకంగా పోరాడేందుకు పిచ్చివాడు మాత్రమే ప్రయత్నిస్తాడు. నీవు మాకు చిక్కితే నీ దేశం నిన్ను రక్షించేందుకు ముందుకు వస్తుందని అనుకుంటున్నావా? లేదు, ఈ గూఢచారులను వదిలేసినట్లే నీ దేశం నిన్ను వదిలేస్తుందని గ్రహించుకో’ అని డేవిడ్ కామెరాన్‌ను ఉద్దేశించి ఓ టెర్రరిస్టు హెచ్చరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement