
బిరుట్ : ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్.. ఇక పూర్తిగా ముగిసిన చరిత్ర అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రూనీ మంగళవారం ప్రకటించారు. ఇస్లామిక్ స్టేట్‌ను దేశం నుంచి పూర్తిగా తుడిచేశామని, ఈ విషయాన్ని ప్రకటించేందుకు గర్వంగా ఉందని రెవెల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మేజర్ జనరల్ ఖసీమ్ సొలేమాని పేర్కొన్నారు.
కొన్నేళ్లుగా ఇరాన్‌లో ఇస్లామిక్ స్టేట్ విస్తృతంగా విస్తరించింది. ఈ క్రమంలో పలు ఉగ్రవాద దాడులను ఇరాన్ ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్‌పై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. కొన్ని నెలలుగా ఐఎస్‌ను ఇరాన్ సైన్యం ఊచకోత కోస్తూ వస్తోంది. అందులో బాగంగానే శనివారం నాటికి దేశసరిహద్దుల నుంచి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను తరిమికొట్టినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది.