తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు!

Indian student in US faces 10 yrs jail - Sakshi

న్యూయార్క్‌: కళాశాలకు చెందిన కంప్యూటర్లకు భారీగా నష్టం కల్గించినందుకు తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన విశ్వనాథ్‌ ఆకుతోట(27) స్టూడెంట్‌ వీసాపై 2015లో అమెరికా వెళ్లాడు. అల్బనీ సిటీలో సెయింట్‌ రోజ్‌ కాలేజీలో 2017లో ఎంబీఏ పూర్తి చేశాడు. ఫిబ్రవరిలో ‘యూఎస్‌బీ కిల్లర్‌’ అనే పెన్‌డ్రైవ్‌ సాయంతో కాలేజీలోని 66 కంప్యూటర్లను పాడుచేశాడు. ఈ పనిని మొబైల్‌లో షూట్‌చేశాడు. అధికారుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన నార్త్‌ కరోలినా పోలీసులు విశ్వనాథ్‌ను అరెస్ట్‌చేశారు. కావాలనే ఈ పనికి పూనుకున్నట్లు ఒప్పుకున్న అతడు జరిగిన నష్టం రూ.40 లక్షలు చెల్లించేందుకు కూడా అంగీకరించాడు. ఆగస్టులో కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top