సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో), సీఎం క్యాంపు ఆఫీసుతోపాటు మంత్రులు, సీఎస్ కార్యాలయాల్లో కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కోసం రూ.12.50 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా ఈ కార్యాలయాలకు కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్లను సరఫరా చేశారు.
ఇందుకుగాను ఏపీటీఎస్‌కు రూ.12.5 కోట్లు విడుదల చేస్తూ ఐటీ శాఖ కార్యాదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తంతో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించడంతోపాటు భవిష్యత్తులో కొనుగోళ్లకు వినియోగించుకోవడానికి అనుమతించారు.


