భార్యను పొడిచి.. పోలీసులకు చెప్పి | Indian Man Allegedly Killed Wife In US While Children Were Asleep | Sakshi
Sakshi News home page

భార్యను పొడిచి.. పోలీసులకు చెప్పి

Jul 24 2016 2:48 PM | Updated on Jul 30 2018 8:29 PM

భార్యను పొడిచి.. పోలీసులకు చెప్పి - Sakshi

భార్యను పొడిచి.. పోలీసులకు చెప్పి

భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కడతేర్చాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో అతి దారుణంగా ఆమెను కత్తితోపొడిచి చంపేశాడు.

న్యూయార్క్: భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కడతేర్చాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో అతి దారుణంగా ఆమెను కత్తితోపొడిచి చంపేశాడు. వారికి ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఆమెను పొడుస్తున్న సమయంలో పిల్లలు పక్క గదిలోనే నిద్రిస్తున్నారు. ఈ ఘటనతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. నితిన్ సింగ్ (46) సీమా సింగ్(42) అనే ఇద్దరు భార్యా భర్తలు. గత కొద్ది కాలంగా వారి మధ్య ఏదో విషయంపై గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

గత వారం ఇలాగే గొడవ పడిన నితిన్ సింగ్.. భార్యను కిచెన్లోకి తీసుకెళ్లి హత్యచేశాడు. అనంతరం తానే స్వయంగా పోలీసుల అత్యవసర నెంబర్ కు ఫోన్ చేసి పిలిచాడు. వేకువ జామున ఈ ఘటన జరగడంతో అప్పటికే అంతా నిద్రమత్తులోనే ఉన్నారు. అరెస్టు చేసినందుకు పోలీసులు వెళ్లిన సమయంలో అతడు తన భార్య రక్తపు మరకలతో దారుణంగా కనిపించాడని, ఆ దృశ్యం భీతావాహంగా కనిపించిందని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement