భారత ఐటీ నిపుణులకు గుడ్‌ న్యూస్‌

Indian Green Card Aspirants may Benefit as Trump has a New Immigration Plan - Sakshi

గ్రీన్‌ కార్డు ఆశావహులకు  శుభవార్త : కొత్త ఇమ్మిగ్రేషన్‌ పాలసీ ప్రతిపాదన

వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న భారతీయ  ఐటీ నిపుణులకు గుడ్‌ న్యూస్‌.  గ్రీన్‌ కార్డు కోసం వేచి వున్న  వేలాది మంది  భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారీ ఊరట నివ్వనున్నారు.  అమెరికా ఇమ్మిగ్రేషన​ విధానంలో  సరికొత్త మార్పులకు  ప్రతిపాదించారు. కుటుంబ సంబంధాల ఆధారంగా గాకుండా నైపుణ్యం ఆధారంగా గ్రీన్‌కార్డు జారీలో  విదేశీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని  యోచిస్తున్నట్టు తెలిపారు. 

ప్ర ప్రస్తుం 66శాతం కుటుంబ  సంబంధాలు  ద్వారా ( గ్రీన్‌కార్డు పొందిన వారు తమ కుటుంబ సభ్యులను, పెళ్లికాని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను స్పాన్సర్‌  చేయడం)  12 శాతం మాత్రమే  నైపుణ్యం ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు.   ట్రంప్‌ సర్కార్‌  ఈ విధానానికి స్వస్తి పలికి మెరిట్‌ ఆధారంగా  గ్రీన్‌ కార్డు అభ్యర్థులను ఎంపిక చేయనుంది.  అమెరికా ఏటా 1,40,000 గ్రీన్‌కార్డులు జారీ చేస్తుంది. కాగా   హెచ్‌1బీ వీసా పొంది   దశాబ్ద కాలంగా గ్రీన్‌కార్డుకోసం  ఎదురు చూస్తున్న   వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకు  ఇది ప్రయోజనం చేకూర్చనుంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top