రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం

 IMF MD ropes in Raghuram Rajan 11 others to key external advisory group - Sakshi

కోవిడ్ -19 : 12 మంది నిపుణులతో  సలహా కమిటీ

ఐఎంఎఫ్ నిఫుణుల కమిటీలో రాజన్

వాషింగ్టన్ : ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్ (57) కీలక గౌరవాన్ని దక్కించుకున్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో భారత దేశంలో అనుసరించాల్సిన ఆర్థికవిధానాలపై పలు కీలక సూచనలు చేసిన ఆయన తాజాగా అంతర్జాతీయ ద్యవ్యనిథి సంస్థ (ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా బృందంలో చోటు దక్కించుకన్నారు. ప్రపంచవ్యాప్తంగా 12మంది ఆర్థిక నిపుణులతో ఏర్పాటైన ఈ కమిటీలో రఘురామ్ రాజన్‌ను కూడా చేరుస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా ఒక ప్రకటన జారీ చేశారు. గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాలపై ప్రపంచ వ్యాప్తంగా దృక్పథాలను అందిస్తుందని  ఐఎంఎఫ్ శుక్రవారం తెలిపింది.

ఆర్థికమాంద్యంతో ఇబ్బందులు పడుతున్న తమ సభ్యదేశాలను ఆదుకునేందుకు, ఆర్థిక సహాయం, సంబంధిత విధానాల రూపకల్పనలో అసాధారణమైన నైపుణ్యం, అగ్రశ్రేణి నిపుణుల సలహాలు  తమకిపుడు చాలా అవసరం అని ఆమె చెప్పారు. వీరంతా తమ అమూల్య సేవలను అందించేందుకు అంగీకరించడం తనకు గర్వంగా ఉందన్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న అసాధారణ సవాళ్లు, కీలక పరిణామాలు, ఇతర విధి విధానాలపై ఈ టీం సూచనలు చేయనుంది. సింగపూర్ సీనియర్ మంత్రి ,సింగపూర్ ద్రవ్య అథారిటీ చైర్మన్  షణ్ముగరత్నం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్  క్రిస్టిన్ ఫోర్బ్స్,  ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, యుఎన్  మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్  లార్డ్ మార్క్ మల్లోచ్ బ్రౌన్  తదితరులు  కమిటీలో వున్నారు. (కరోనా : శరవేగంగా ఆర్థిక వ్యవస్థ పతనం)

కాగా కోవిడ్-19 మహమ్మారి గడచిన శతాబ్దంలో ఎదురైన సంక్షోభాలన్నికంటే తీవ్రమైన సంక్షోభాన్నిఎదుర్కొంటున్నామంటూ ఇప్పటికే క్రిస్టలినా ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర మందగనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ మహమ్మారి మరింత దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్ సభ్య దేశాల్లోని సుమారు 170 దేశాల్లో తలసరి ఆదాయం క్షీణించిందని పేర్కొన్నారు. 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా పనిచేసిన రాజన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. (దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్)

నకిలీ వార్తలకు చెక్ చెప్పిన రతన్ టాటా
కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

19-04-2021
Apr 19, 2021, 03:34 IST
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణలో గోల్డెన్‌ స్టాండర్డ్‌గా ఆర్టీపీసీఆర్‌ (రివర్స్‌ ట్రాస్క్రిప్షన్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌)ను చెప్పుకుంటాం. కరోనా నిర్ధారణలో...
19-04-2021
Apr 19, 2021, 02:54 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు శనివారంతో ఖాళీ కావడం వల్ల వ్యాక్సినేషన్‌ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వైద్య,...
19-04-2021
Apr 19, 2021, 01:42 IST
సాక్షి, హైదరాబాద్‌: వ్యాక్సిన్ల కొరత రాష్ట్రంలో టీకాల కోసం ఎదురుచూస్తున్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు నిరాటంకంగా కొనసాగిన...
19-04-2021
Apr 19, 2021, 01:21 IST
మొట్టమొదటి మానవ జన్యురాశి 20 సంవత్సరాల అత్యద్భుతమైన శాస్త్రీయ పురోగతి ఫలితంగా సంభవించింది. ఇప్పుడు లభిస్తున్న అత్యంత భారీ స్థాయి...
18-04-2021
Apr 18, 2021, 13:54 IST
సాక్షి, హైదారబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ విజృంభిస్తోంది. దీంతో దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది....
18-04-2021
Apr 18, 2021, 12:22 IST
దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. సెకండ్‌ వేవ్‌ కరోనా‌ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో వరుసగా నాలుగో రోజు కరోనా కేసుల...
18-04-2021
Apr 18, 2021, 12:14 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో...
18-04-2021
Apr 18, 2021, 11:53 IST
మోత్కుపల్లికి ఐసీయూలో చికి​త్స అందిస్తున్నామని వ్యైదులు పేర్కొన్నారు.
18-04-2021
Apr 18, 2021, 11:37 IST
దేశంలో కేసులు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అత్యవసర ఔషధమైన రెమిడెసివిర్‌కు తీవ్ర కొరత ఏర్పడిందనే వార్తల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ...
18-04-2021
Apr 18, 2021, 11:11 IST
కరోనా నివారణకు వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు కూడా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు రోగులు వస్తుండడంతో పీహెచ్‌సీల వద్ద జనం రద్దీ పెరిగిపోతోంది. ...
18-04-2021
Apr 18, 2021, 09:34 IST
కరోనా రోగులు ఇలా పగటి పూట ఊరవతల ఉన్న రావి చెట్టు కింద ఉంటున్నారు. రాత్రి కాగానే ఇళ్లలో ఏర్పాటు...
18-04-2021
Apr 18, 2021, 05:20 IST
సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. కోవిడ్‌ పాజిటివ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతోంది. పెద్దసంఖ్యలో రోగులకు ఆసుపత్రుల్లో...
18-04-2021
Apr 18, 2021, 04:08 IST
ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఉంటే నిర్దేశిత వయసుల వారు వేసుకోవచ్చని, లేదంటే వారు కూడా నిలిపివేస్తారని అంటున్నారు.
18-04-2021
Apr 18, 2021, 03:41 IST
సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రానికి శనివారం 6 లక్షల డోసుల కోవిడ్‌ టీకా వచ్చింది. తొలుత పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి...
18-04-2021
Apr 18, 2021, 02:30 IST
ప్రపంచం మొత్తం మీద శనివారం నాటికి కరోనా కారణంగా 30 లక్షల మంది మరణించారు.
18-04-2021
Apr 18, 2021, 02:23 IST
న్యూఢిల్లీ:  దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. వైరస్‌ వ్యాప్తి మరింత ఉధృతమయ్యింది. వరుసగా మూడో రోజు 2 లక్షలకుపైగా...
17-04-2021
Apr 17, 2021, 18:16 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,907 మందికి పరీక్షలు...
17-04-2021
Apr 17, 2021, 13:41 IST
కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు. పసిగుడ్డు నుంచి పండు ముదుసలి వరకు అందరినీ కాటేస్తోంది.
17-04-2021
Apr 17, 2021, 12:24 IST
‘‘నేను మాస్కు పెట్టుకోకపోతే.. మీ కేంటి’’ అంటూ పార, ఇనుప రాడ్లతో వారిపై దాడికి యత్నించాడు.
17-04-2021
Apr 17, 2021, 11:58 IST
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గాలి ద్వారానే చాలా తీవ్రంగా వ్యాపిస్తోందట. దీని వ్యాప్తి వస్తువుల కంటే.. గాలి ద్వారానే పెద్ద మొత్తంలో వైరస్...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top