బాయ్‌ఫ్రెండ్‌ కారును స్విమ్మింగ్‌పూల్‌లో దింపి.. | I dumped her, she dumped my car': Gentile | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్‌ కారును స్విమ్మింగ్‌పూల్‌లో దింపి..

Oct 14 2017 4:23 PM | Updated on Oct 15 2017 7:00 AM

I dumped her, she dumped my car': Gentile

లండన్‌ : తన బాయ్‌ఫ్రెండ్‌పై కోపాన్ని ఓ గర్ల్‌ఫ్రెండ్‌ వెరైటీగా తీర్చుకుంది. బ్రేకప్‌ అయిన తర్వాత ఆగ్రహంతో అతడి కారును ఏకంగా స్విమ్మింగ్‌పూల్‌లో పార్కింగ్‌ చేసింది.. ఇంతల ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించగా 'నేను నాగర్ల్‌ప్రెండ్‌ను డంప్‌ చేశాను.. ఆమె నా కారును స్విమ్మింగ్‌పూల్‌లో డంప్‌ చేసిందంతే' అంటూ అతడు తాఫీగా సమాధానం ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. రష్యాన్‌ మోడల్‌ అయిన క్రిస్టినా కుచ్మా(24) జెంటిల్‌(41) అనే వ్యక్తి ఎప్పటి నుంచో గాఢంగా ప్రేమించుకుంటున్నారు.

ఫుల్‌గా డేటింగ్‌ కూడా చేశారు. అయితే, తొలుత తన వ్యాపారానికి పెట్టుబడి తానే పెడతానని నమ్మబలికిన జెంటిల్‌ ఆ తర్వాత హ్యాండిచ్చాడని, కావాలని బ్రేకప్‌ చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. అతడు వాల్‌ స్ట్రీట్‌లో ఓ బ్యాంకర్‌ కావడంతో అతడి మాటలు నమ్మానని, చివరకు మోసపోయానని వాపోయింది. దీంతో అతడిపై ఆగ్రహంతో అతడి లక్ష డాలర్ల విలువైన మెర్సిడేస్‌ బెంజ్‌ కారును కనిపించకుండా చేసింది. అయితే, అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు గాలింపులు జరిపిన తర్వాఆ ఆ కారు ఓ స్మిమ్మింగ్‌లో కనిపించింది. అతడిపై కోపంతో ఆమెనే ఇలా చేసినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement