ఆ నిందితుడు.. నరమాంస భక్షకుడు! | i ate humans, says Florida Teen | Sakshi
Sakshi News home page

ఆ నిందితుడు.. నరమాంస భక్షకుడు!

Nov 2 2016 9:26 AM | Updated on Oct 5 2018 8:48 PM

ఆ నిందితుడు.. నరమాంస భక్షకుడు! - Sakshi

ఆ నిందితుడు.. నరమాంస భక్షకుడు!

అస్టిన్ హర్రౌఫ్ అనే 19 ఏళ్ల ఫ్లోరిడా యువకుడు మార్టిన్ కౌంటీ లో నమోదైన ఓ కేసులో భాగంగా విచారణ చేపట్టిన అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు.

వాషింగ్టన్: అస్టిన్ హర్రౌఫ్ అనే 19 ఏళ్ల ఫ్లోరిడా యువకుడు మార్టిన్ కౌంటీ లో నమోదైన ఓ కేసులో భాగంగా విచారణ చేపట్టిన అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. గత ఆగస్టులో ఫ్లోరిడాకు చెందిన జాన్ స్టీవెన్స్, మిచెల్లీ మిష్కాన్ అనే వృద్ధ దంపతుల హత్య కేసులో హర్రౌఫ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతడికి ఉన్న వింత అలవాటే హత్య కేసులో దోషిగా తేల్చింది.

పోలీసు అధికారి విలియం సిండర్ కథనం ప్రకారం.. గత ఆగస్టు మధ్యలో ఫ్లోరిడా వృద్ద దంపతులు హత్యకు గురయ్యారు. జాన్ స్టీవెన్స్, మిచెల్లీ మిష్కాన్ అనే వృద్ధ దంపతులను హత్య చేసిన తర్వాత వారి ముఖంపై, ఛాతిపై కొంత భాగాన్ని కొరికి తిన్నట్లు అప్పట్లోనే గుర్తించారు. సరిగ్గా ఆ హత్యలు జరిగిన మరుసటి రోజు హర్రౌఫ్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. హర్రౌఫ్ అక్కడ వాంతికి చేసుకోగా కొన్ని ఆశ్చర్యకర నిజాలు వెల్లడయ్యాయి. అతడి నోటి నుంచి మనుషుల వెంటుకలు, శరీర భాగాల ముక్కలు రావడం గమనించారు. వైద్యులకు ఏదో అనుమానం వచ్చి పోలీసులకు సమచారం అందించారు.

పోలీసులు ఆస్పత్రిలోనే హర్రౌఫ్ ను విచారణచేయగా.. అది మనుషుల మాంసమేనని, తాను మనుషులను చంపి కొద్ది శరీరభాగం తింటానని తాపీగా సమాధానమిచ్చాడు. దీంతో ఆశ్యర్యపోవడం పోలీసుల వంతైంది. ఫ్లోరిడా దంపతుల హత్య తర్వాత దంతాలతో దారుణంగా స్టీవెన్స్ ముఖం, ఛాతి భాగాలపై కొరికి దాడి చేసి, కొంత భాగాన్ని తిన్నాడని మార్టిన్ కౌంటీ పోలీసు అధికారి విలియం స్నైడర్ తెలిపారు. ఫ్కాక్కా అనే డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా హర్రౌఫ్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని భావిస్తున్నారు. అతడిని కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించిన తర్వాత మార్టిన్ కౌంటీ జైలుకు ఇటీవల తరలించినట్లు స్నైడర్ వివరించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement