ఎవ్వరినీ వదల్లేదు.. ఇక నీ వద్దకు వచ్చేస్తా.. | I amm Coming For You, A Mother is on Social Media | Sakshi
Sakshi News home page

ఎవ్వరినీ వదల్లేదు.. ఇక నీ వద్దకు వచ్చేస్తా..

May 14 2016 10:56 AM | Updated on Oct 22 2018 6:02 PM

ఎవ్వరినీ వదల్లేదు.. ఇక నీ వద్దకు వచ్చేస్తా.. - Sakshi

ఎవ్వరినీ వదల్లేదు.. ఇక నీ వద్దకు వచ్చేస్తా..

అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురు శవమై కనిపిస్తే ఆ మాతృమూర్తి వేదన ఎలా ఉంటుంది.

అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురు శవమై కనిపిస్తే ఆ మాతృమూర్తి వేదన ఎలా ఉంటుంది. కూతురు లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లి.. కూతుర్ని హత్య చేసిన వారిని వదిలి పెట్టకూడదని నిర్ణయించుకుంది. పదేళ్ల కిందట 24 ఏళ్ల కూతురి అంత్యక్రియలు చేసిన తల్లి బెలిండా లేన్ పగతో రగిలిపోతోంది. నిందితుల వివరాలు కనిపెట్టి పోలీసులకు ఇచ్చేందుకు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు కూడా తెరిచింది.

కూతురు క్రిస్టల్ థియోబాల్డ్ డెడ్ బాడీతో తాను ప్రామిస్ చేశానని కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. 2006 ఫిబ్రవరిలో కూతురు క్రిస్టల్ ఓ బైక్ పై వెళ్తోంది. ఆ బైక్ పై క్రిస్టల్ సోదరుడితో పాటు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తాను కారులో వెళ్తుండగా తన వెనకాలే ఆ బైక్ వస్తుందని, ఇంతలో కొందరు వ్యక్తులు ఆ ముగ్గురిపై దారుణంగా కాల్పులకు తెగబడ్డారని విషాధాన్ని గుర్తుచేసుకుంది. కూతురి బాయ్ ఫ్రెండ్ కడుపులో బుల్లెట్లు దిగినా, చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. క్రిస్టల్ శరీరంలోకి బుల్లెట్లు చాలా దూసుకెళ్లడంతో గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది.

ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్కరిని వదలిపెట్టేది లేదని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బెలిండా చెప్పింది. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిందితుల వివరాల కోసం తీవ్రంగా ప్రయత్నించానని వివరించింది. కాలిఫోర్నియాకు చెందిన చివరి నిందితుడు సొటేలో అరెస్టయ్యాడని, బెయిల్ కూడా రాలేదని పేర్కొంది. నిందితులకు శిక్ష పడేలా చేసే ప్రతయ్నంలో తాను ఏ అఘాయిత్యమైనా చేసి యావజ్జీవ శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని, ఆ నిందితులను వదిలేది లేదంటూ గతంలో చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంది. నిందితులకు శిక్ష పడిందని ఇక తనకు ఇష్టంలేదంటూ తల్లి బెలిండా లేన్  ఏడ్చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement