
తిరానా: ఐరోపా దేశం ఆల్బేనియాలో భారీ భూకంపం సంభవించి 20 మంది చనిపోయారు. మంగళవారం ఉదయం 4 గంటలకు (స్థానిక కాలమానం) భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఆల్బేనియా రాజధాని తిరానాకు 30 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. రాత్రి వేళ వేళ భూకంపం రావడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. 600 మందికి పైగా గాయపడగా, భూకంపం ధాటికి మూడు భవనాలు కూలినట్లు అధికారులు వెల్లడించారు.