
నీటిపైనా చందమామ..
ఏంటి ఒకే ఫొటోలో రెండు చంద్రుళ్లు కనిపిస్తున్నారు అని కంగారు పడ్డారా.. ఇందులో ఆకాశంలో ఉన్నది నిజమైన చందమామే..
ఏంటి ఒకే ఫొటోలో రెండు చంద్రుళ్లు కనిపిస్తున్నారు అని కంగారు పడ్డారా.. ఇందులో ఆకాశంలో ఉన్నది నిజమైన చందమామే.. కానీ సముద్రంపై ఉన్నది మాత్రం ఓ హోటల్. నీటిలో తేలియాడేది. పేరు సిల్వర్ పర్ల్. ఖతర్‌లోని దోహాలో నిర్మించనున్నారు. 30 అంతస్తులతో కూడిన ఈ హోటల్‌లో వెయ్యికి పైగా గదులుంటాయి.
అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దీన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.10 వేల కోట్లకుపైగా వెచ్చించనున్నారు. ఈ హోటల్‌లో ఓ తోటను కూడా నిర్మిస్తారు. హెలికాప్టర్లు, నౌకల ద్వారా ఈ హోటల్‌కు వచ్చే సదుపాయముంది. దీంతోపాటు తీరం నుంచి నాలుగు లేన్ల రోడ్డును కూడా నిర్మిస్తున్నారు. 2022లో ఖతర్‌లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ జరగనుంది. ఆసరికి దీని నిర్మాణం పూర్తవుతుందని చెబుతున్నారు.