విమానం అదృశ్యమైన ప్రాంతంలో భారీ వర్షం | heavy rain at AirAsia flight Missing area | Sakshi
Sakshi News home page

విమానం అదృశ్యమైన ప్రాంతంలో భారీ వర్షం

Dec 28 2014 6:10 PM | Updated on Sep 2 2017 6:53 PM

గల్లంతయిన ఇండోనేసియా విమానం ఆచూకీ కనుగొనేందుకు కోసం చేపట్టిన సహాయక కార్యక్రమాలను ఆపివేశారు.

న్యూఢిల్లీ: గల్లంతయిన ఇండోనేసియా విమానం ఆచూకీ కనుగొనేందుకు కోసం చేపట్టిన సహాయక కార్యక్రమాలను ఆపివేశారు. విమానం గల్లంతయిన ప్రాంతంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో సహాయాక కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఆదివారం ఉదయం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం-క్యూజెడ్ 8501 గగన తలంలో అదృశ్యమైంది. విమానంలో మొత్తం 162 మంది ఉన్నారు. దీని ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. తూర్పు బెలితుంగ్ వద్ద సముద్రంలో కూలిపోయినట్టు అనధికార సమాచారం.  అదృశ్య ఘటనపై సాయం చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. విమానం ఆచూకీ కనుగొనేందుకు భారత్ మూడు నౌకలు, ఒక విమానాన్ని సిద్ధంగా ఉంచింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement