అతను ఇలా ప్రేమించాడు..! | he loves to she continues one year! | Sakshi
Sakshi News home page

అతను ఇలా ప్రేమించాడు..!

Aug 28 2016 1:10 AM | Updated on Sep 4 2017 11:10 AM

అతను ఇలా ప్రేమించాడు..!

అతను ఇలా ప్రేమించాడు..!

రెండేళ్ల క్రితం ఆమె అతనికి ఓ డేటింగ్ వెబ్‌సైట్‌లో పరిచయం అయింది. ఇద్దరి మధ్య మాటామాటా కలసి మనసులు ముడిపడ్డాయి.

రెండేళ్ల క్రితం ఆమె అతనికి ఓ డేటింగ్ వెబ్‌సైట్‌లో పరిచయం అయింది. ఇద్దరి మధ్య మాటామాటా కలసి మనసులు ముడిపడ్డాయి. దీంతో ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాడు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని చాలా సార్లు అడగాలనుకున్నాడు. కానీ, అందరిలానే ప్రపోజ్ చేస్తే అందులో కొత్తేముంటుంది. అందుకే అతను చాలా దీర్ఘంగా ఆలోచించి ఓ వినూత్న నిర్ణయానికి వచ్చాడు. ‘ నువ్వే నా జీవిత సర్వస్వం.. నన్ను పెళ్లి చేసుకుంటావా.. నా భార్యగా ఉంటావా’ అని ఏడాదిపాటు విభిన్నంగా ప్రపోజ్ చేస్తూ ఓ వీడియో రూపొందించాడు.

ప్రతిరోజూ ఆమె పట్ల తనకు కలిగే భావనలను ఓ కార్డు మీద రాసి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని కోరుతూ దానిని వీడియోలో చిత్రీకరించాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 364 రోజుల పాటు ఏకబిగిన ఇలా ఆమె పట్ల తనలోని ప్రేమను వ్యక్తం చేస్తూ రూపొందించిన ఈ వీడియోను ఎట్టకేలకు ప్రియురాలి చేతిలో పెట్టాడు. అతని మనసులోని మాటను వీడియో రూపంలో చూసి ముగ్ధురాలు అయిన ఆమె అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది. ఇలా వినూత్నమైన రీతిలో ప్రపోజ్ చేసి తన ప్రేమను గెలుచుకున్నాడు షికాగోకు చెందిన జోష్ షిమిట్జ్.

డానియెల్ రోయెష్‌తో ప్రేమలో పడిన అతను.. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు ప్రతిరోజూ ఆమెపై కలిగే తన ప్రేమభావనలను కార్డుపై వ్యక్తం చేసి దానిని చిత్రీకరించాడు. లక్కీగా అతడి ఏడాదిగా గూడు కట్టుకున్న ప్రేమ తపనను గుర్తించిన రోయెష్... పెళ్లికి సై అంది. ఈ జంట వినూత్న ప్రేమకథ తాజాగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. 364 రోజులూ అతను విభిన్నంగా ప్రపోజ్ చేస్తూ రూపొందించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆకట్టుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement