breaking news
dating website
-
పోటాపోటీగా ‘కన్యత్వ’ అమ్మకాలు
సాక్షి వెబ్‌డెస్క్ : చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అమ్మ వైద్యం కోసమో, కేన్సర్‌తో బాధపడుతున్న నాన్న వైద్యం కోసమో రష్యా, చైనా, థాయ్‌లాండ్ యువతులు తమ కన్యత్వాన్ని బహిరంగ వేలం ద్వారా అమ్ముకునేవారు. జర్మనీ, నెదర్లాండ్‌కు చెందిన యువతులు ప్రపంచ పర్యటనకు అవసరమైన డబ్బుల కోసమో, ప్రపంచాన్ని తిప్పి చూపించే ధనికుడికో తమ కన్యత్వాన్ని అమ్ముకునేవారు. ఇప్పుడు రష్యాకు చెందిన యువతులు అపార్టుమెంట్లు కొనుక్కోవడానికి, ఒకేసారి ధనవంతులు అయిపోవడానికి తమ కన్యత్వాన్ని వేలం వేస్తున్నారు. ఇదివరకు ఇలా కన్యత్వాన్ని వేలం వేసుకునే కన్యలు ఒకరో, ఇద్దరో ఉండగా ఇప్పుడు వేల మంది యువతులు పోటీపడి మరీ ముందుకు వస్తున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఇటు కన్యలను, అటు ధనవంతులను కలిపి కాస్త సొమ్ము సంపాదించేందుకు దళారులు కూడా బయల్దేరారు. దళారుల ఫీజులు కూడా లక్షల రూపాయల్లో ఉంటున్నాయి. దీంతో కొందరు యువతులు ‘రైట్ టు ది ఫస్ట్ నైట్’ అనే వేదికలకు, డేటింగ్ వెబ్సైట్లలో తమ కన్యత్వం అమ్మకానికి ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి వారిని ఆకర్షించడం కోసం దళారులు కూడా క్లబ్బులు ఏర్పాటు చేస్తూ ఆ క్లబ్బుల పేరిట వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తున్నారు. అలాగే ఆన్లైన్ ‘బ్యాడ్ గర్ల్స్ క్లబ్’ ఏర్పాటయింది. రష్యాలోని ఏ నగరానికి చెందిన వారైనా సరే, 19 ఏళ్లలోపుండి, అందంగా, ఆకర్షణీయంగా ఉన్న వాళ్లు కావాలంటూ ఇలాంటి క్లబ్బులో ప్రకటనలు ఇస్తున్నారు. తాము కన్యగానే ఉన్నట్లు వేలంలో పాల్గొనే అమ్మాయిలు అవసరమైన వైద్య సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది. ఏ నగరానికి చెందిన వారైనా సరే యువతి ఫొటోలు నచ్చితే మాస్కో వరకు వచ్చి పోయేందుకు టిక్కెట్లు కూడా ఉచితంగానే పంపిస్తామని దళారులు చెబుతున్నారు. దాంతో మిలానా మెర్సర్ లాంటి వారు పడకపై అర్థ నగ్నంగా దిగిన ఫొటోలను దళారీలకు పంపిస్తున్నారు. ఇలంటిదే మరో క్లబ్ ‘డెస్పరేట్ వర్జిన్స్ క్లబ్’ పేరిట ఏర్పాటయింది. ‘నాకు 19 ఏళ్లు. ఎత్తు 175 సెంటీమీటర్లు, బరువు 65 కిలోలు. కన్యత్వం అమ్మడానికి సిద్ధం. వ్యక్తిగత సందేశం పంపించండి’ అంటూ ఒకరు. ‘వయస్సు 17, కన్యత్వం అమ్మకానికి సిద్ధం. వ్యక్తిగత సందేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తాను’ అంటూ మరొకరు డెస్పరేట్ వర్జిన్స్ క్టబ్’కు పోస్టింగ్‌లు చేస్తున్నారు. అనంతరం బ్రోకర్లు ‘ఫలానా మరినా 18,90,000 రూపాయలకు తన కన్యత్వాన్ని అమ్ముకొని ఎంచెక్కా ఓ ఫ్లాట్ కొనుక్కొంది....ఫలానా అమ్మాయి పది లక్షల రూపాయలకు కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టగా...పాపం, ఫలానా అమ్మాయి కేన్సర్‌తో బాధ పడుతున్న తన తల్లికి చికిత్స చేయించేందుకు కేవలం మూడు లక్షల రూపాయలకే కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది’ అన్న ప్రకటనలు క్లబ్‌ల పేరిట వెలిసిన వైబ్సైట్లలో తెగ కనిపిస్తున్నాయి. ‘నేను వళ్లు అమ్ముకునే పడుపు వత్తి చేయాలనుకోవడం లేదు. ఒక్క పైసా ఇవ్వక పోయినా సరే, బాగా డబ్బున్న యువకుడితో అనుభవాన్ని కోరుకుంటున్నాను’ లాంటి ప్రకటనలు కూడా కొంత మంది యువతులు చేస్తున్నారు. ‘నేను 500 డాలర్లు చెల్లించి అనేక మంది కన్నె పిల్లల పొందును కొనుక్కున్నాను’ అని ఓ మెడికల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న అన్న అనే బైసెక్సువల్ తెలిపారు. డేటింగ్ క్లబ్బులు వల్గర్‌గా ఉంటున్నందున తాను కూడా ‘క్లబ్’ సైట్లను ఆశ్రయిస్తున్నానని తెలిపారు. ఫలానా మెలీనా అనే 18 ఏళ్ల అమ్మాయి తన కన్యత్వాన్ని 20 లక్షల రూపాయలకు ఫలానా హోటల్లోని, ఫలానా గదిలో అమ్ముకుందంటూ కూడా బ్రోకర్లు పబ్లిసిటీ ఇస్తున్నారు. కన్యత్వానికి సిద్ధమైన వారితో టీవీ ఛానళ్లు టాక్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. వారు ఎందుకు కన్యత్వాన్ని అమ్ముకుంటున్నారో ఎలాంటి ఇబ్బంది లేకుండా వీడియో సాక్షిగా తెలియజేస్తున్నారు. -
అతను ఇలా ప్రేమించాడు..!
రెండేళ్ల క్రితం ఆమె అతనికి ఓ డేటింగ్ వెబ్సైట్లో పరిచయం అయింది. ఇద్దరి మధ్య మాటామాటా కలసి మనసులు ముడిపడ్డాయి. దీంతో ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకున్నాడు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని చాలా సార్లు అడగాలనుకున్నాడు. కానీ, అందరిలానే ప్రపోజ్ చేస్తే అందులో కొత్తేముంటుంది. అందుకే అతను చాలా దీర్ఘంగా ఆలోచించి ఓ వినూత్న నిర్ణయానికి వచ్చాడు. ‘ నువ్వే నా జీవిత సర్వస్వం.. నన్ను పెళ్లి చేసుకుంటావా.. నా భార్యగా ఉంటావా’ అని ఏడాదిపాటు విభిన్నంగా ప్రపోజ్ చేస్తూ ఓ వీడియో రూపొందించాడు. ప్రతిరోజూ ఆమె పట్ల తనకు కలిగే భావనలను ఓ కార్డు మీద రాసి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని కోరుతూ దానిని వీడియోలో చిత్రీకరించాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 364 రోజుల పాటు ఏకబిగిన ఇలా ఆమె పట్ల తనలోని ప్రేమను వ్యక్తం చేస్తూ రూపొందించిన ఈ వీడియోను ఎట్టకేలకు ప్రియురాలి చేతిలో పెట్టాడు. అతని మనసులోని మాటను వీడియో రూపంలో చూసి ముగ్ధురాలు అయిన ఆమె అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది. ఇలా వినూత్నమైన రీతిలో ప్రపోజ్ చేసి తన ప్రేమను గెలుచుకున్నాడు షికాగోకు చెందిన జోష్ షిమిట్జ్. డానియెల్ రోయెష్తో ప్రేమలో పడిన అతను.. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు ప్రతిరోజూ ఆమెపై కలిగే తన ప్రేమభావనలను కార్డుపై వ్యక్తం చేసి దానిని చిత్రీకరించాడు. లక్కీగా అతడి ఏడాదిగా గూడు కట్టుకున్న ప్రేమ తపనను గుర్తించిన రోయెష్... పెళ్లికి సై అంది. ఈ జంట వినూత్న ప్రేమకథ తాజాగా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. 364 రోజులూ అతను విభిన్నంగా ప్రపోజ్ చేస్తూ రూపొందించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో ఆకట్టుకుంటోంది. -
'మా అక్కకు ఒక తోడు కావాలి'
డేటింగ్ వెబ్సైట్లలో చేరి ఒంటరి జీవితానికి ఓ తోడు వెతుక్కోవడం పాశ్చాత్యులకు అలవాటే. అదేరీతిలో ఇప్పుడు అక్క కౌర్ట్నీ కర్దాషియన్ కోసం ఓ తోడును వెతికేందుకు హాలీవుడ్ టీవీ నటి కిలీ జెన్నర్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కౌర్ట్నీ పేరిట 'బంబుల్' అనే డేటింగ్ వెబ్సైట్లో ఓ అకౌంట్ ఓపెన్ చేసింది. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన కౌర్ట్నీ కొన్ని నెలల కిందట తన ప్రియుడు స్కాట్ డిసిక్ తో వేరయింది. అప్పటి నుంచి ఈ అమ్మడు ఒంటరిగా ఉంటోంది. 37 ఏళ్ల కౌర్ట్నీ ఇటీవల తనకంటే చాలా చిన్నవాడైన జస్టిన్ బీబర్ (22)తో చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్టు కథనాలు వచ్చాయి. కాగా, కౌర్ట్నీ ఫొటోలు, ఆమె వయస్సు, చదువు, ఇతర వివరాలు తెలియజేస్తూ డేటింగ్ యాప్‌లో కిలీ ప్రొఫైల్ ఏర్పాటుచేసింది. 'నా దగ్గర కౌర్ట్నీ ఫోన్ నంబర్ ఉంది. ఆమె పాస్వర్డ్ నాకు తెలుసు. ఈ అకౌంట్‌కు వచ్చిన మెసెజెస్ నేను మీకు చదివి వినిపిస్తాను. ఆమె మెసెజ్‌లు చదివితే నన్ను చంపేస్తుందేమో. అయినా బంబుల్ (యాప్)లో ఆమె ఉండాల్సిన అవసరముంది' అని 20 ఏళ్ల కిలీ పేర్కొంది. డేటింగ్ యాప్‌లో అక్క అకౌంట్ తెరిచిన సందర్భంగా తన అక్కలు కౌర్టీ, ఖ్లోహి కర్దాషియన్ లతో కలిసి ఈ అమ్మడు పార్టీ కూడా చేసుకుంది.