'మా అక్కకు ఒక తోడు కావాలి' | Kourtney Kardashian joins dating website | Sakshi
Sakshi News home page

'మా అక్కకు ఒక తోడు కావాలి'

May 22 2016 9:03 AM | Updated on Sep 4 2017 12:41 AM

డేటింగ్ వెబ్‌సైట్‌లలో చేరి ఒంటరి జీవితానికి ఓ తోడు వెతుక్కోవడం పాశ్చాత్యులకు అలవాటే.

డేటింగ్ వెబ్‌సైట్‌లలో చేరి ఒంటరి జీవితానికి ఓ తోడు వెతుక్కోవడం పాశ్చాత్యులకు అలవాటే. అదేరీతిలో ఇప్పుడు అక్క కౌర్ట్నీ కర్దాషియన్‌ కోసం ఓ తోడును వెతికేందుకు హాలీవుడ్ టీవీ నటి కిలీ జెన్నర్‌ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కౌర్ట్నీ పేరిట 'బంబుల్‌' అనే డేటింగ్‌ వెబ్‌సైట్‌లో ఓ అకౌంట్‌ ఓపెన్ చేసింది.

ముగ్గురు పిల్లలకు తల్లి అయిన కౌర్ట్నీ కొన్ని నెలల కిందట తన ప్రియుడు స్కాట్ డిసిక్‌ తో వేరయింది. అప్పటి నుంచి ఈ అమ్మడు ఒంటరిగా ఉంటోంది. 37 ఏళ్ల కౌర్ట్నీ ఇటీవల తనకంటే చాలా చిన్నవాడైన జస్టిన్ బీబర్‌ (22)తో చెట్టాపట్టాలేసుకొని తిరిగినట్టు కథనాలు వచ్చాయి. కాగా, కౌర్ట్నీ ఫొటోలు, ఆమె వయస్సు, చదువు, ఇతర వివరాలు తెలియజేస్తూ డేటింగ్‌ యాప్‌లో కిలీ ప్రొఫైల్ ఏర్పాటుచేసింది.

'నా దగ్గర కౌర్ట్నీ ఫోన్‌ నంబర్‌ ఉంది. ఆమె పాస్‌వర్డ్ నాకు తెలుసు. ఈ అకౌంట్‌కు వచ్చిన మెసెజెస్‌ నేను మీకు చదివి వినిపిస్తాను. ఆమె మెసెజ్‌లు చదివితే నన్ను చంపేస్తుందేమో. అయినా బంబుల్‌ (యాప్‌)లో ఆమె ఉండాల్సిన అవసరముంది' అని 20 ఏళ్ల కిలీ పేర్కొంది. డేటింగ్‌ యాప్‌లో అక్క అకౌంట్ తెరిచిన సందర్భంగా తన అక్కలు కౌర్టీ, ఖ్లోహి కర్దాషియన్‌ లతో కలిసి ఈ అమ్మడు పార్టీ కూడా చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement