ట్రంప్‌కు ఇరాన్‌ అధ్యక్షుడి వార్నింగ్‌

Hassan Rouhani Warns Donald Trump - Sakshi

టెహ్రాన్‌ : పులితో ఆటలు వద్దని ఇరాన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ హసన్‌ రౌహనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా కొనసాగిస్తున్న విరుద్దమైన విధానాలకు స్వస్తి చెప్పాలని రౌహనీ పేర్కొన్నారు. ఇరానియన్ దౌత్యవేత్తల సమావేశంలో ఆదివారం రౌహనీ ప్రసంగిస్తూ.. ‘ఇరాన్‌తో యుద్దం అంటే యుద్దాల తల్లితో పారాడమే. మాతో యుద్దం అంత సులువైనది కాదు. శాంతికి మారుపేరు ఇరాన్‌ అన్న విషయం అమెరికాకు తెలుసు. యుద్దానికి ప్రతీరూపం కూడా ఇరాన్‌ అనే విషయం ట్రంప్‌ తెలుసుకుంటే మంచిది’ అని రోహనీ పేర్కొన్నారు.

2015లో ఇరాన్‌ ప్రవేశపెట్టిన న్యూక్లియర్‌ ఒప్పందాన్ని అమెరికా ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అమెరికా ఇరాన్‌పై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించి, రాజకీయంగా ఒత్తిడిని తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇరాన్‌ భద్రత, ప్రయోజనాలను ప్రేరేపించే స్థితిలో అమెరికా లేదని రోహనీ అన్నారు. ఇస్లామిక్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వాషింగ్టన్‌ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాగా ఇరాన్‌ మిలిటెంట్‌ గ్రూప్స్‌కు సహకరిస్తోందని గతంలో అమెరికా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దానికి వ్యతిరేకంగానే ఇరాన్‌ న్యూక్లియర్‌ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుందని వైట్‌హౌస్‌ గతంలో ప్రకటించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top