హెచ్‌1 బీ- ట్రంప్‌ కొత్త ప్రతిపాదనలు

Give H1-B visa only to skilled, highest paid foreigners, says Trump Admin - Sakshi

ఐటీ నిపుణులకు మాత్రమే హెచ్‌1 బీ వీసా

సంవత్సరానికి 65వేల వీసాలు

డిసెంబరు 3- జనవరి 2 మధ్య అభిప్రాయ స్వీకరణ

వాషింగ్టన్‌:  అమెరికాఅధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటినుంచి హెచ్‌1బీ వీసా జారీ విధానం సంస్కరణపై కసరత్తు  చేస్తున్న డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం  మరోసారి కొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. హెచ్‌1 బీ వీసా జారి విధానానికి సంబంధించిన నిబంధనల్లో తాజా మార్పులు చేసింది.  ఈ కొత్త నిబంధనల ప్రతిపాదనలతో శుక్రవారం  ఒక నోటీసు జారీ  చేసింది.
 
ముఖ్యంగా విదేశీ కార్మికుల్లో అత్యున్నత నైపుణ్యం, అత్యధిక జీతం పొందేవారికి  మాత్రమే హెచ్‌1 బీ వీసాలు జారీ చేస్తామని యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ నిర్ణయించే పరిమితి మేరకు విదేశీ కార్మికులకు హెచ్‌1 బీ వీసా ఇచ్చే సమయంలో ఈ నిబంధనలను పాటించాలని పేర్కొంది.

యూఎస్‌సీఐఎస్‌ నిర్ణయించే తేదీల్లో విదేశీయులు ఎలక్ర్టానిక్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని ఈ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఏడాదికి 65వేల వీసాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అనుమతి ఉంది. అయితే అమెరికాలో మాస్టర్స్‌ డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు ఉన్న 20వేల దరఖాస్తులను ఈ పరిమితి నుంచి మినహాయిస్తారు.  హోం  ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం  విడుదల చేసిన 139పేజీల డాక్యుమెంట్‌లోని కొత్త ప్రతిపాదనలపై  డిసెంబర్‌ 3 నుంచి జనవరి 2వ తేదీ మధ్య ప్రజలు తమ అభిప్రాయం తెలుపవచ్చని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top