చేతుల్లేని చిన్నారి.. చేతిరాతలో ఛాంపియన్‌!

Girl with no hands Sara Hinesley becomes hand writing Champion - Sakshi

మేరీల్యాండ్‌ :  చేతులు సక్రమంగా ఉన్నా.. అందమైన చేతి రాతను సొంతం చేసుకోవడమనేది గగనమే. అలాంటిది ఆ చిన్నారికి పుట్టుక నుంచి చేతులు లేవు. కానీ, చేతి రాతలో మాత్రం ఆమెది అందేవేసిన ‘చేయి’. సారా హినెస్లే అనే 10 ఏళ్ల బాలిక ఇటీవల అమెరికాలో జరిగిన జాతీయ హ్యాండ్‌ రైటింగ్‌ కాంపిటీషన్‌లో ఛాంపియన్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం చేతి రాతే కాదు.. ఈ చిన్నారి అందమైన పెయింటింగులు, చిత్రలేఖనాలు, శిల్పాలను కూడా తయారు చేయగలదు.

ఇటీవల ఆమె ఇంగ్లీషులో కర్సీవ్‌ రైటింగ్‌ కూడా నేర్చుకుంది. సారా ఫ్రెడెరిక్‌లో సెయింట్‌ జాన్స్‌ రీజనల్‌ క్యాథలిక్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. చేతులు లేకపోవడం వల్ల రెండు చేతుల మణికట్టుతో పెన్సిల్‌ పట్టుకుని రాస్తోంది. సారా కుటుంబం 2015లో చైనా నుంచి అమెరికాకు వలస వచ్చారు. దీంతో ఆమెకు మొదట్లో ఇంగ్లీషు వచ్చేది కాదు. అయితే సారా పట్టుదలతో ఇంగ్లీష్‌ నేర్చుకోవడమే కాకుండా చేతి రాతలో కూడా ప్రావీణ్యం సాధించడం విశేషం. ఈ పోటీలో విజయం సాధించినందుకు సారాకు రూ.35 వేలు నగదు బహుమతి లభించనుంది.     –సాక్షి, స్టూడెంట్‌ ఎడిషన్‌                                                                                                                                                                                                                            

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top